Pages

సిరిగలవానికి చెల్లును - చమత్కారపద్యం

సిరిగలవానికి చెల్లును
తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్.
ధనవంతుడు (లక్ష్మికి భర్త ఐన విష్ణువు) పదహారు వేలమందికి పెళ్లి చేసుకున్నా ఫరవాలేదు.కానీ బిచ్చగాడికి ఇద్దరు భార్యలెందుకు? పరమేశ్వరా! నీకు పార్వతి చాలు, గంగను విడిచి పెట్టు.(పల్నాటిలో నీళ్ళు దొరకక శ్రీనాథుడు చెప్పిన చాటు పద్యంగా ఇది ప్రసిద్ధం)

No comments:

Post a Comment