Pages

Telugu Kiranaalu - చదువది యెంత కల్గిన

Telugu Kiranaalu - చదువది యెంత కల్గిన 
చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా 
చదువు నిరర్థకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ 
బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం 
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా !

అర్థాలు : రసజ్ఞత = రసికత , సారం గ్రహించటం ; ఇంచుక = కొంచెం ; నిరర్థకం = వ్యర్థం; 
              గుణసంయుతులు = బుద్దిమంతులు ;  ఇంపొదెవెడు = రుచి పుట్టించే , అందాన్నిచే 

భావం : మనిషి యెంత చదువుకున్న రస గ్రహణ శక్తి లేకపోతే ఆ చదువు వ్యర్థం. బుద్దిమంతులు అతని చదువును మెచ్చుకోరు. ఎలాగంటే మంచికూరను చాలా రుచిగా నలపాకం లాగా వండినా, ఆ కూరలో ఉప్పు లేకపోతే రుచి కలుగదు కదా . 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు