Pages

శబ్దవిభాగము - Telugu Grammar

  శబ్దవిభాగము -  - తెలుగు వ్యాకరణం 

ఆంధ్రభాష 

 1. తత్సమము.

 2. తద్భవము. 

3. దేశ్యము. 

4. గ్రామ్యము అని నాలుగు విధములు. 

1. తత్సమము: సంస్కృత శబ్దములతోను, ప్రాకృత శబ్దములతోను సమానమైన రూపములు కలవి. అనగా విభక్తి ప్రత్యయములు చేరిన  సంస్కృత, ప్రాకృత పదములను తత్సమములందురు. వీనినే ప్రకృతి పదములు అనికూడ అందురు.

ఉదా: రామః  (సంస్కృతము) రాముడు (తత్సమము)

సంస్కృత ప్రాకృత శబ్దముల చివర ఉండే విసర్గముకాని, పొల్లుగాని, దీర్ఘముగాని త్రోసివేయవలసినచోట డు,ము,వు అనుప్రత్యయములు చేర్చినచో తత్సమములగును. 

2. తద్భవము: సంస్కృత ప్రాకృత శబ్దముల వలన పుట్టిన పదములను తద్భవములందురు. వీనినే వికృతి పదములని కూడా అందురు.

 ఉదా: రథః  (సంస్కృతము(ప్రకృతి)) రథము (తత్సమము) అరదము (తద్భవము(వికృతి)) 

3. దేశ్యము: దేశంలో వ్యవహరింపబడు శబ్దములు దేశ్యములనబడును.

ఇవి

1. ఆంధ్రదేశమునందు మాత్రమే వాడబడు పదములు ఆంధ్రదేశ్య ములు. ఉదా: కాయ, కూర, తల్లి, తండ్రి మొదలగునవి.

2. ఆంధ్రదేశమునందు వాడబడుచున్న ఇతర భాషాపదములను అన్యదేశ్యములందురు. ఉదా: స్కూలు మొదలగునవి.

 4. గ్రామ్యము: గ్రామములోని పామర జనులు వాడు పదములను గ్రామ్యములందురు. ఇవి నింద్య గ్రామ్యములు, అనింద్య గ్రామ్యములని రెండు విధములు.

1. నింద్య గ్రామ్యములు: వ్యాకరణమునకు విరుద్ధమైన శబ్దములను నింద్య గ్రామ్యములందురు.

ఉదా: వస్తాడు, పోతాడు మొదలగునవి.

2. అనింద్య గ్రామ్యములు: వ్యాకరణమునకు విరుద్ధమైనను మహా కవులచేత గ్రంథములలో వాడబడిన పదములను అనింద్య గ్రామ్యములందురు. ఉదా: కలకంఠుడు, జీవగఱ్ఱ మొదలగునవి.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు