Pages

వ్యాకరణాంశాలు - సంధి పదాలు

వ్యాకరణాంశాలు - సంధి పదాలు 

కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీసి, సంధి పేరు రాయండి. 

ఉదా: రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. 

 అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశ సంధి 

1. గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. 
గర్వ + ఉన్నతి = గర్వోన్నతి - గుణసంధి 
(సూత్రము : అ కారమునకు ఇ, ఉ, ఋ - లు పరమగునపుడు ఏ, ఓ, అర్ - లు ఆదేశముగా వచ్చును. ఏ, ఓ, అర్ - లను గుణములందురు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చినది. )
2. అభ్యాగతులకు దానం చేయడం మంచిది. 
అభి + ఆగతులు = అభ్యాగతులు - యణాదేశసంధి 
(సూత్రము: ఇ, ఉ, ఋ లకు అసమ వర్ణములు పరమైనపుడు క్రమముగా య, వ, ర - లు ఆదేశముగా వచ్చును. య, వ, ర - లను "యన్నులు"  అంటారు. 
యన్నులు ఆదేశముగా వచ్చు సంధి కావున యణాదేశ సంధియైనది. )
3. రంతిదేవుడు వదాన్యోత్తముడు 
వదాన్య + ఉత్తముడు = వదాన్యోత్తముడు - గుణసంధి
(సూత్రము : అ కారమునకు ఇ, ఉ, ఋ - లు పరమగునపుడు ఏ, ఓ, అర్ - లు ఆదేశముగా వచ్చును. ఏ, ఓ, అర్ - లను గుణములందురు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చినది. )
4. అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. 
అణు + ఆయుధాలు = అణ్వాయుధాలు - యణాదేశసంధి
(సూత్రము: ఇ, ఉ, ఋ లకు అసమ వర్ణములు పరమైనపుడు క్రమముగా య, వ, ర - లు ఆదేశముగా వచ్చును. య, వ, ర - లను "యన్నులు"  అంటారు. 
యన్నులు ఆదేశముగా వచ్చు సంధి కావున యణాదేశ సంధియైనది. )

No comments:

Post a Comment

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు