స్త్రీ రూఢివాచక శబ్దములు
| స్త్రీ వాచక శబ్దములు | వివరణ | ప్రయోగము |
| అరుంధతి | వశిష్ఠుని భార్య | ఉత్తమ ఇల్లాలు |
| అనసూయ | అత్రి మహాముని భార్య | గొప్ప పతివ్రత |
| ఊర్వశి | ఇంద్రసభలో నర్తకి - అప్సరస | సుబుద్ధి కలది |
| కాళి | పార్వతీదేవి అవతారాలలో ఒకటి | రుద్రరూప స్త్రీ |
| కైకేయి | దశరథుని మూడవ భార్య | అతి మూర్ఖురాలు |
| గాంధారి | ధృతరాష్టుని భార్య | పతివ్రత |
| చిత్రాంగి | రాజరాజ నరేంద్రుని రెండవ భార్య | అతి దుర్మార్గురాలు |
| జ్యేష్ఠాదేవి / పెద్దమ్మ | విష్ణుదేవుని పెద్ద భార్య | అదృష్ట హీనురాలు |
| తాటకి | రాక్షస స్త్రీ | దుర్మార్గురాలు |
| ద్రౌపది | పాండవుల పత్ని | ఎక్కువ భర్తలు కలది |
| ఢాకిని | మంత్రగత్తె | అతిదుష్ట స్త్రీ |
| పార్వతీదేవి | శివుని భార్య | పెద్ద ముత్తైదువ |
| పూతన | ఒక రాక్షసి | దుర్మార్గురాలు |
| భద్రకాళి | పార్వతీదేవి అంశ | దేవి స్వరూపిణి |
| మండోదరి | రావణుని భార్య | ఒడ్డు పొడవు గల స్త్రీ |
| మంధర | కైకేయి దగ్గర దాసి | తంత్రము గల స్త్రీ |
| మోహిని | విష్ణువు మాయారూపం | మోహనాన్ని గొలిపే స్త్రీ |
| మిత్రవింద | కృష్ణుని భార్య | మిక్కిలియుక్తి గల స్త్రీ |
| శకుంతల | మేనక విశ్వామిత్రుల కుమార్తె | మిక్కిలి అందగత్తె |
| రంభ | ఇంద్రసభలో నర్తకి - అప్సరస | అతి సుందరాంగి |
| రతీదేవి | మన్మథుని భార్య | అందమైన స్త్రీ |
| లక్ష్మీదేవి | విష్ణుమూర్తి భార్య | ధనమునకు అధిష్ఠాన దేవత |
| లంఖిణి | లంకను కాపలకాయు రాక్షస స్త్రీ | దుష్ట స్త్రీ |
| శూర్పణఖ | రావణుని సోదరి | దుష్టురాలు |
| సత్యభామ | కృష్ణుని భార్య | భర్తను లొంగదీసుకున్న స్త్రీ |
| సరస్వతి | బ్రహ్మదేవుని భార్య | విద్యకు అధిష్టాన దేవత |
| సీతాదేవి | శ్రీరాముని భార్య | మహా పతివ్రత |
| శబరీ | అడవిలో రామునికి పళ్ళు పెట్టిన కోయ స్త్రీ | వృద్ధురాలు |
| కాళిక | మహిషాసుర మర్థనీ | భయంకర స్త్రీ |
| అన్నపూర్ణ | కాశీ విశ్వనాథుని భార్య | తృప్తిగా అన్నం పెట్టు స్త్రీ |
No comments:
Post a Comment