Pages

వర్ణ సమామ్నాయము - Telugu Grammar

 వర్ణ సమామ్నాయము-తెలుగు వ్యాకరణం 

ఆంధ్రభాషకు వర్ణములు 56. అందులో అచ్చులు: 16. ఇవి ఇతర వర్ణ సహాయములేక ఉచ్చరించబడును.

అఆ  ఇఈ ఉఊ  ఋౠ ఌౡ ఏఏఐ ఒఓఔ వీనికి స్వరములని, ప్రాణములని మారు పేర్లు. 

హలులు: 37. కఖగఘఙ  చౘఛజౙఝఞ  టఠడఢణ  తథదధన పఫబభమ  యరఱలవ శషసహళ.

ఇవి అచ్చుల సహాయము చేత ఉచ్చరింపబడును. వీనిని వ్యంజనములు  అని కూడ అందురు.

ఉభయాక్షరములు: 3. ఁ,ం,ః ఇవి అచ్చుల యొక్క, హల్లుల యొక్క ధర్మములు కలవి.కనుక వీటిని ఉభయాక్షరములు అందురు.  

అంతస్థములు: య,ర,ల,వ అనునవి.

 ఊష్మములు: శ,ష,స,హ, అనునవి. 

పరుషములు: క, చ, ట, త, ప  అనునవి. ఇవి కఠినముగా  పలుకబడును. కావున వీనికి పరుషములని పేరు. 

సరళములు: గ,జ,డ,ద,బ అనునవి. ఇవి తేలికగా పలుకబడును. కావున వీరికి సరళములని పేరు. 

అనునాసికములు: ఙ,ఞ,ణ,న,మ   అనునవి. ఇవి ముక్కు సహాయంతో పలుకబడును. కావున వీనికి అనునాసికములని పేరు.

 వర్గాక్షరములు: 'క'కారము మొదలు 'మ'కారము వరకుగల హల్లులను వర్గాక్షరములందురు. ఇవి ఐదు వర్గములు.

1. క వర్గము : కఖగఘఙ

2. చ వర్గము : చచజఝఞ

3. ట వర్గము : టఠడఢణ 

4. త వర్గము : తథదధన 

5. ప  వర్గము : పఫబభమ

వర్గయుక్కులు: వర్గయుక్కులనగా ఐదు వర్గములలోని ద్వితీయ, చతుర్దాక్షరములు. ఖ,ఛ,ఠ,థ,ఫ,ఘ,ఝ,ఢ,ధ,భ అనునవి.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు