వస్తురూఢీ వాచక శబ్దములు
| శబ్దములు | వివరణ | ప్రయోగము |
| అపరంజి | బంగారు | మిక్కిలి యోగ్యుడు |
| అక్షయ పాత్ర | ధర్మరాజుకు సూర్యుడు ఇచ్చినది | ఎప్పటికీ తరగనిది |
| ఇంద్రమాల | ఒక పుష్పము | ఎప్పటికీ వాడనిది |
| ఉక్కు | ఒక ధాతు మిశ్రమము | గట్టివాడు |
| కల్పవృక్షము | దేవతల వృక్షము | అన్ని విధాల ఉపయోగపడేది |
| కుంభకోణము | దక్షిణాది పట్టణము | మోసము |
| గాండీవము | అర్జునుని ధనుస్సు | తిరుగులేని గురి |
| త్రిశంకు స్వర్గము | విశ్వామిత్రుని సృష్టి | మధ్యస్థంగా ఉగిసలాడు |
| చట్రాయి(చట్టుబండ) | అతి కఠినమైన పెద్ద బండ | ఏమీ చేయని బండ |
| పర్వతము | కొండ | ఉన్నతమైనది |
| పాంచజన్యం | శ్రీకృష్ణుని శంఖము | ఉత్సాహాన్ని కలుగచేసేది |
| పాశుపతాస్త్రం | అర్జునుడు పొందిన అస్త్రం | గొప్ప శక్తివంతమైనది |
| పుష్పకము | కుబేరుని విమానము | అనంతమైన చోటు కలది |
| బంగారము | ఉత్తమమైన ధాతువు | ఉత్తముడు |
| బృందావనం | కృష్ణుడు గోపికలతో కలిసిన ప్రదేశం | అందమైన వనం |
| మేరువు | గొప్ప పర్వతం | ధైర్య సాహసాలకు నెలవు |
| మత్స్య యంత్రం | ద్రౌపదీ స్వయంవరంలో ఉన్నది | మిక్కిలి కష్ట సాధ్యమైనది |
| ముత్యము | నవరత్నములలో ఒకటి | మిక్కిలి యోగ్యమైనది |
| రత్నము | ఒక మణి | మిక్కిలి యోగ్యమైనది |
| వజ్రము | నవరత్నములలో ఒకటి | మిక్కిలి యోగ్యమైనది |
| వననాభి | విషము | అతి దుర్మార్గుడు |
| సంకెళ్ళు | శృంఖలములు | ప్రతిబంధకములు |
| సీసము | లోహములలో ఒకటి | పిచ్చివాడు |
| స్తంభము | గుంజ | మూఢుడు |
| స్వర్గము | దేవతలు ఉండు స్థలం | సుప్రదేశము |
| నరకం | పాపులుండే స్థలం | కష్టములు కలుగు ప్రదేశం |
No comments:
Post a Comment