పురుష రూఢివాచక శబ్దములు
| వాచక శబ్దములు | వివరణ | ప్రయోగము |
| అక్రూరుడు | శ్రీకృష్ణుని మేనమామ | మంచివాడు |
| అగస్త్య భ్రాత | అగస్త్య మహర్షి సోదరుడు | అనామకుడు |
| అర్జునుడు | ధర్మరాజు సోదరుడు | అపజయం ఎరుగనివాడు |
| అగ్నిహోత్రుడు | అగ్నిదేవుడు | పరిశుద్ధుడు, సర్వభక్షకుడు |
| అభిమన్యుడు | అర్జునుని కుమారుడు | అసహాయ యోధుడు |
| ఆంజనేయుడు | అంజన కుమారుడు | అత్యంత బలవంతుడు |
| ఇంద్రుడు | స్వర్గానికి అధిపతి | భోగలాలసుడు |
| ఇంద్రజిత్తు | రావణుని కుమారుడు | అతితంత్రగాడు |
| ఉగ్రకుడు | కద్రువ కుమారుడు | సర్పము |
| కంసుడు | కృష్ణుని మేనమామ | పరమ దుర్మార్గుడు |
| కర్కోటకుడు | సర్పముల రాజు | కఠిన చిత్తుడు |
| కర్ణుడు | కుంతీపుత్రుడు | మహాదాత |
| కుబేరుడు | ఉత్తర దిక్పాలకుడు | గొప్ప ధనవంతుడు |
| గణపతి | ఈశ్వరుని కుమారుడు , అవిఘ్నకారి | మొట్టమొదటి లేఖరి |
| చిత్రగుప్తుడు | యముని వద్ద లెక్కలు వ్రాసేవాడు | మిక్కిలి వ్రాతకాడు |
| జాంబవంతుడు | బ్రహ్మదేవుని కుమారుడు | మిక్కిలి పొడవైనవాడు |
| తక్షకుడు | ఒక సర్పరాజు | మిక్కిలి క్రూరుడు |
| దుర్వాసుడు | మహాముని | ముక్కోపి |
| ధన్వంతరి | క్షీరసాగరలో జన్మించాడు | గొప్ప వైద్యుడు |
| ధర్మరాజు | పాండవుల జ్యేష్ఠుడు | ధర్మము తప్పనివాడు |
| ధృతరాష్ట్రుడు | దుర్యోధనాధుల తండ్రి | పుట్టు గుడ్డివాడు |
| నక్షత్రకుడు | విశ్వామిత్రుని శిష్యుడు | పట్టువిడవని వాడు |
| నలకూబరుడు | కుబేరుని కుమారుడు | మంచి రూపసి |
| నారదుడు | బ్రహ్మదేవుని కుమారుడు | కలహప్రియుడు, త్రిలోకసంచారి |
| బలి చక్రవర్తి | ఒక రాక్షసరాజు | గొప్పదాత |
| బృహస్పతి | దేవగురువు | మిక్కిలి బుద్ధిమంతుడు |
| భీష్ముడు | సర్వధర్మ శాస్త్రవేత్త | గొప్ప ప్రతిజ్ఞ చేసినవాడు |
| మన్మథుడు | కృష్ణుని కుమారుడు | గొప్ప అందగాడు |
| మారీచుడు | రావణుని మిత్రుడు | మాయలమారి |
| యమధర్మరాజు | దక్షిణ దిక్పాలకుడు | అతిభయంకరుడు |
| కుంభకర్ణుడు | రావణుని సోదరుడు | నిద్రముచ్చు |
| రావణాసురుడు | పులస్త్య బ్రహ్మ మనవడు | లంకాధిపతి, అతి సమర్థుడు |
| విష్వక్సేనుడు | విష్ణువు యొక్క సేనాని | విఘ్నములు పోగొట్టువాడు |
| విదురుడు | వ్యాస - అంబికల కుమారుడు | నీతి విద్యాపారంగతుడు |
| శనైశ్చరుడు | నవగ్రహములలో ఒకరు | అదృష్టహీనుడు |
| శకుని | దుర్యోధనుని మేనమామ | కపటి, దుష్టుడు |
| శల్యుడు | కర్ణుని సారథి | దొంగ సారథి |
| శుక్రాచార్యుడు | రాక్షస గురువు | ఒక కన్ను కలవాడు |
| శ్రీరాముడు | దశరథుని కుమారుడు | ఆదర్శ పురుషుడు |
| హరిశ్చంద్రుడు | ఇక్ష్వాకుల వంశపురాజు | సత్యమునే పలికేవాడు |
| ప్రవరాఖ్యుడు | మనుచరిత్ర నాయకుడు | ఘోటక బ్రహ్మచారి |
| ప్రహ్లాదుడు | హిరణ్యకశిపుని కుమారుడు | హరిభక్తుడు |
| బ్రహ్మ | సృష్టికర్త | త్రిమూర్తులలో ఒకరు |
| రుద్రుడు | శివుడు | మిక్కిలి కోపం కలవాడు |
| ఏకలవ్యుడు | గొప్ప విలుకాడు | గురువు లేకనే విద్య అభ్యసించినవాడు |
| ఉత్తరుడు | విరాటరాజు కుమారుడు | గొప్పలు చెప్పువాడు |
| వాల్మీకి | పుట్టనుంచి పుట్టినవాడు | ఆది వ్యక్తి |
| కుచేలుడు | శ్రీకృష్ణుని మిత్రుడు | పేదవాడు |
No comments:
Post a Comment