Pages

బాలనీతి పద్యం - ఆ పుట్టుకకు సార్ధకత ఉండాలి!

 బాలనీతి పద్యం - ఆ పుట్టుకకు సార్ధకత ఉండాలి! 

జీవమున్నముపడే  కాక చచ్చిన పిదపను
 జగతి కెంతయు మేల్సేయ చాల వలయు
బ్రతికి వృక్షము నీడయు ఫలము లిచ్చు
చచ్చి, వంటకై చెరకును చాల కూర్చు 
అర్థము : మనిషి బతికి ఉన్నప్పుడుమాత్రమే కాకుండా, చనిపోయిన తర్వాతకూడా సమాజానికి మేలుచేయగలగాలి. చెట్టు బతికి ఉన్నప్పుడు నీడనిస్తుంది, ఫలాల నిస్తుంది; చనిపోయిన తర్వాత వంటచెరకును కూడా చాలా సమకూరుస్తుంది.
                      కొందరు జీవించినంతకాలం ఇతరులను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వాళ్లను వదిలేద్దాం. కొందరు మాత్రం తమతోపాటు ఇత రులూ సుఖశాంతులతో జీవించాలనుకుంటారు. అందుకోసం తపన పడతారు. అయితే జీవించినంతకాలమే కాకుండా తదనంతరంకూడా సమాజానికి ఏదో మేలు జరిగేలా బతికి ఉన్నప్పుడే చేయగలగాలి. అందు కోసం మనుషులు అలా జీవిస్తున్న చెట్టును ఆదర్శంగా పెట్టుకోవాలి.ఎందుకంటే చెట్టు జీవించినంతకాలం నీడతో బాటు పండ్లనూ, చచ్చి పోయిన తర్వాత వంటకోసం కట్టెల్నీ ఇస్తుంది కాబట్టి.


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు