జంతు రూఢీ వాచక శబ్దములు
| శబ్దములు | వివరణ | ప్రయోగము |
| ఉడుము | ఒక సరీసృపము | గొప్ప పట్టుగలది |
| ఎనుబోతు | మహిషము | మడ్డివాడు |
| దమనకులు | జంతుపాత్రలు, నక్కలు | జిత్తులమారివి |
| కామధేనువు | క్షీరసాగర మథనంలో లభించిన గోవు | సమస్తమును ఇచ్చునది |
| కుక్క | శునకము | వదరుబోతు |
| కోతి | వానరుడు | చెడ్డపని చేసేవాడు |
| గాడిద | గార్దభము | మందబుద్ధి |
| గొర్రె | మేషజాతి | అమాయకుడు |
| గోవు | ఆవు | సాధు జంతువు పూజింపదగినది |
| జలగ | జలచరము | పీడించువాడు |
| తేలు | వృశ్చికం | హాని చేసేవాడు |
| దోమ | మశకము | హానిచేయువాడు |
| గుంటనక్క | జంబుకము | తంత్రము గలవాడు |
| పక్షి | రెక్కలు గల జీవి | తెలివిలేనిది |
| పక్షిరాజు | గరుత్మంతుడు | అనామధేయుడు |
| పశువు | నాల్గుకాళ్ళ జంతువు | తెలివి తక్కువవాడు |
| పిల్లి | మార్జాలము | అమాయకత్వాన్ని ప్రదర్శించేది |
| పులి | వ్యాఘ్రము | గొప్ప ధైర్యశాలి |
| భల్లూకము | ఎలుగుబంటి | గట్టి పట్టుకలది |
| మేకపోతు | మగమేక | పైకి గాంభీర్యముగా ఉండును |
| లేడి | హరిణము | పరుగులో మేటి |
| శేషాహి | ఆదిశేషుడి సర్పము | మిక్కిలి సమర్థుడు |
| సింహము | (కేసరి) మృగరాజు | అతిశూరుడు |
No comments:
Post a Comment