Pages

తెలుగు వ్యాకరణం - సంస్కృత సంధులు

 తెలుగు వ్యాకరణం - సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి:

సూత్రం: అ-ఇ-ఉ-ఋలకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని "సవర్ణదీర్ఘ సంధి" అంటారు.

ఉదా: రామ + ఆజ్ఞ = రామాజ్ఞ

మహి + ఈశుడు = మహీశుడు

గురు + ఉపదేశం = గురూపదేశం

పితృ + ఋణం = పితౄణం

2. గుణ సంధి: 

సూత్రం:అకారానికి "ఇ-ఉ-ఋ"లు పరమైతే క్రమంగా "ఏ-ఓ-అర్‌"లు ఏకాదేశమవడాన్ని "గుణసంధి"  అంటారు.

ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం

మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు

ఇతర + ఇతర = ఇతరేతర

రాజ + ఋషి = రాజర్షి

3. వృద్ధి సంధి: 

సూత్రం:"అ" కారానికి "ఏ, ఐ"లు పరమైతే "ఐ" కారాన్ని; "ఓ, ఔ" లు పరమైతే "ఔ" కారాన్ని; "ఋ, ౠ" లు పరమైతే "ఆర్"  ఏకాదేశమవడాన్ని "వృద్ధి సంధి" అంటారు. "ఐ, ఓ, ఔ"లను వృద్ధులు అంటారు.

ఉదా: భువన + ఏక = భువనైక

అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం

పాప + ఓఘం = పాపౌఘం

పరమ + ఔషధం = పరమౌషధం

ఋణ + ఋణం = ఋణార్ణం

4. యణాదేశ సంధి:

సూత్రం: "ఇ-ఉ-ఋ"లకు అసవర్ణాచ్చులు పరమైతే క్రమంగా "య-వ-రలు" ఆదేశమవడాన్ని యణాదేశ సంధి అంటారు. ‘ఇక్కులకు (ఇ-ఉ-ఋ) యణ్ణులు (య-వ-ర) పరమవుతున్నందు వల్ల ఇది యణాదేశ సంధి.

ఉదా:జయంతి + ఉత్సవం = జయంత్యుత్సవం

హిందూ + ఆర్యులు = హింద్వార్యులు

పితృ + ఆర్జితం = పిత్రార్జితం

5. జశ్త్వ సంధి: 

సూత్రం: "క-చ-ట-త-ప"లకు అచ్చులు కానీ, "హ-య-వ-ర-లు" కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, పరమైతే "గ, జ, డ, ద, బ"లు ఆదేశమవడాన్ని "జశ్త్వసంధి" అంటారు.

ఉదా: తత్ + అరణ్య భూములు = తదరణ్య భూములు

అచ్ + అంతం = అజంతం

వాక్ + ఈశుడు = వాగీశుడు

కకుప్ + అంతం = కకుబంతం

సత్ + భావం = సద్భావం

6. శ్చుత్వ సంధి: 

సూత్రం:"స"కారత వర్గాలకు "శ"కారచ వర్గాలు పరమైనప్పుడు శకారచ వర్గాలే ఆదేశమవడాన్ని "శ్చుత్వ సంధి" అంటారు.

(సకార-త థ ద ధ న) (త వర్గం)

(శకార - చ ఛ జ ఝ ఞ) (చవర్గం)

ఉదా: తపస్ + శమము = తపశ్శమము (స్(స)+శ= శ్శ)

సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) - చ= చ్ఛ)

సత్+జనుడు= సజ్జనుడు (త్ (త)+జ= జ్జ)

విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి (త్ (త)+ శ=చ్ఛ)

7. అనునాసిక సంధి:

సూత్రం: వర్గ ప్రథమాక్షరాలకు (క-చ-ట-త-ప)‘న, మ’ అనునాసికాలు పరమైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి.

ఉదా:

వాక్ + మయం = వాఙ్మయం (క-ఙ=నిత్యం)

జగత్ + నాటకం = జగన్నాటకం = జగద్నాటకం (వికల్పం)

(అనునాసికం రానప్పుడు వర్గ తృతీయాక్షరం) (త-ద-వికల్పం)

మృట్ + మయం = మృణ్మయం, మృడ్మయం (టకు అనునాసికం రానప్పుడు డకారం వికల్పం)

8. విసర్గ సంధి: 

సూత్రం:అకారం పూర్వముందున్న విసర్గకు వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు అ-హ-య-వ-ర-లలు పరమైనప్పుడు విసర్గ - ఓకారంగా మారుతుంది. (వర్గ తృతీయాక్షరాలు- గ, జ, డ, బ, లు వర్గ చతుర్థాక్షరాలు (ఘ, ఝ, ఢ, ధ, భ, లు)

వర్గ పంచమాక్షరాలు: ఙ- ఞ- ణ- న-మ్ (అనునాసికాలు) హ-య-వ-ర-లలు పరమైనప్పుడు మాత్రమే విసర్గ ఓకారంగా మారుతుంది. 

ఉదా:

అయః + మయం = అయోమయం (యః + మ = ఓ)

ఇతః + అధికం = ఇతోధికం (తః+అ = ఓ)

చతుః + ఆత్మ = చతురాత్మ (తుః + ఆ = ‘ర’ కారం వచ్చింది)

తపః ఫలము = తపఃఫలం (ఫ కారం వర్గ ద్వితీయాక్షరమైనందు వల్ల విసర్గలో మార్పు లేదు).

9. పర సవర్ణ సంధి: 

సూత్రం:పదాంతం ముందున్న ‘త’ కారానికి లకారం పరమైనప్పుడు ‘ల’ కారమే ఆదేశంగా రావడాన్ని పర సవర్ణ సంధి అంటారు. (త్ - తకారానికి లకారం వస్తే ‘ల్ల’ కారం వస్తుంది)

ఉదా: భగవత్ + లీల = భగవల్లీల (త్ + ల = ల్ల)

ఉత్ + లేఖనం = ఉల్లేఖనం (త్+లే = ల్లే)

విద్యుత్ + లత = విద్యుల్లత (త్ + ల = ల్ల)

సుహృత్ + లాభం = సుహృల్లాభం (త్ + లా = ల్లా)

10. పరరూప సంధి: 

సూత్రం:హల్లుల్లోని అకారానికి అకారం పరమైతే రెండో పదంలోని మొదటి అచ్చు ఏకాదేశమవుతుంది. దీన్ని పరరూపసంధి అంటారు.

ఉదా: సార + అంగము = సారంగము

(ర్ + అ = రకారంలోని అకారానికి ‘అ’ కారం పరమై రకారానికి దీర్ఘం వచ్చింది)

సీమ + అంతము = సీమంతము

(మ్ + అకారానికి అకారం పరమై అకార దీర్ఘం వచ్చింది)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు