సుమతీ శతకము - అల్లుని మంచితనంబును
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
భావము : అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదానియందు నిజమును,
పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులును లోకములో నుండవు.
No comments:
Post a Comment