వేమన పద్యం - నిన్ను జూచెనేని తన్ను దా మరచును (సి. పి. బ్రౌన్ )
నిన్ను జూచెనేని తన్ను దా మరచును
తన్ను జూచెనేని నిన్ను మరచు
నే విధమున జనుడు నెరుగు నిన్నును దన్ను
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: నిన్ను దైవాన్ని చూస్తుంటే తనను తానే మరచిపోతున్నారు. తన్ను చూసుకుంటుంటే నిన్ను చూడ్డం మరిచిపోవడం జరుగుతోంది. నిన్నూ తననీ ఏకం చేసి జనుడు ఎలా చూడగల్గుతాడూ అని భావం.
No comments:
Post a Comment