Pages

Bhaskara Shataka Padyalu - ఏడ ననర్హు డుండు నట కేఁగు ననర్హుడు నర్హుడున్న చో

భాస్కర శతక పద్యాలు - ఏడ ననర్హు డుండు నట కేఁగు ననర్హుడు నర్హుడున్న చో 
ఏడ ననర్హు డుండు నట కేఁగు ననర్హుడు నర్హుడున్న చో
జూడఁగ నొల్లడెట్లన నశుద్ధగుణస్థితి నీగ పూయముం 
గూడినపుంటిపై నిలువఁ గోరినయట్టులు నిల్వనేర్చునే 
సూడిదబెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీద  భాస్కరా!

తాత్పర్యము : ఈగ, చీముతో కూడిన కురుపుపై వ్రాలియుండుకు ఇష్టపడునట్లుగా కస్తూరి బొట్టుపై నుండుటకు ఇష్టపడదు. అట్లే నీచుడెందుగలడో అచటికే నీచుడగువాడు పోయి నిల్వ జూచును గాని, సజ్జనుడున్నచోటికి పోవుట ఆ నీచునకు గిట్టదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు