Pages

తెలుగు వ్యాకరణం - వ్యుత్పత్యర్థములు

తెలుగు వ్యాకరణం - వ్యుత్పత్యర్థములు  
ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసేవి వ్యుత్పత్యర్థాలు.
విశ్వంభరుడు - సర్వమునూ భరించువాడు(విష్ణువు)
వదాన్యు౦డు - మిక్కిలిగా  ఇచ్చేవాడు (మంచి దాత)
త్రివిక్రముడు - మూడు లోకాలనూ మూడు అడుగులచే ఆక్రమించినవాడు (విష్ణువు)
ధాత్రి - సర్వమునూ ధరించేది (భూమి)
అభ్యాగతుడు  - భోజనకాలమున వచ్చిన అతిథి (తిథి, పర్వము, ఉత్సవములందు ద్రవ్యాశతో
                            వచ్చినవాడు) 
నీరజభవుడు - పద్మమున పుట్టినవాడు (బ్రహ్మ)
హరి - భక్తుల హృదయాలను ఆకర్షించువాడు (విష్ణువు)
హరుడు - భక్తుల పీడలను సర్వము హరించువాడు (లేదా) ప్రళయకాలమున సర్వమును
                  హరించేవాడు (శివుడు)
మాణవకుడు - మనువు యొక్క అల్పమైన సంతానము (16 ఏండ్లు కూడా నిండని బాలుడు)
నలినాక్షుడు - తామరల వంటి అక్షులు కలవాడు (విష్ణుమూర్తి)
ధరణీసురుడు - భూమి యందలి దేవత (బ్రాహ్మణుడు)
విష్ణుడు - విశ్వమున వ్యాపించి ఉండువాడు (విష్ణువు)
అంధకారం = లోకులను అంధులుగా చేసేది -చీకటి
అనలుడు = లోకమునకు జీవనాధారమైనవాడు -అగ్ని
అనిమిషులు - రెప్పపాటు లేనివారు - దేవతలు
అనిలుడు - ప్రాణులకు జీవనాధారమైనవాడు -వాయువు 
అమృతం = మరణమును పొందింపనిది - సుధ
ఇతిహాసం - ఇలా జరిగిందని చెప్పేది - తొల్లిటికథ
ఉరగము = (ఉరస్సు) పొట్టతో పాకేది -పాము
ఉర్వి - విశాలమైనది -భూమి
కంఠీరవం = కంఠంలో ధ్వని కలది - సింహం
క్ష్మా = భారం వహించడంలో ఓర్పుకలది - భూమి 
కేశము  - శిరస్సున ఉండేది - వెంట్రుక
ఖగం = ఆకాశంలో పోవునది - పక్షి 
ఛాందసుడు = ఛందోరూపమైన వేదం చదివినవాడు-బ్రాహ్మణుడు
తార - దీనిచే నావికులు తరింతురు -చుక్క
దినకరుడు = దినాన్ని కల్గజేయువాడు - సూర్యుడు
ధరణి = సమస్తాన్ని ధరించునది - భూమి
నందనుడు =సంతోషమును కలిగించువాడు- కొడుకు
భూజము = భూమినుండి పుట్టినది -చెట్టు
వారిజము = నీటినుండి పుట్టినది - పద్మం
వారిజ గర్భుడు = పద్మము గర్భముగా గలవాడు - బ్రహ్మ
శరధి = శరములకు (నీళ్ళకు) నిధి - సముద్రం
స్రవంతి - పర్వతాదుల నుండి స్రవించునది - నది
భూజం - భూమియందు పుట్టింది (వృక్షం)
ఇల్లాలు-ఇంటి యందలి స్త్రీ (గృహిణి)
ఆఖండలుడు - కొండల రెక్కలను ఖండించినవాడు (ఇంద్రుడు)
ఇతిహాసం - ఇది ఈ విధంగా జరిగిందనే పూర్వ రాజుల చరిత్ర (రామాయణం, భారతం)
ఇందిర - గొప్ప ఐశ్వర్యం గలది (లక్ష్మీదేవి)
ఇంద్రాణి - ఇంద్రుడి భార్య (శచీ దేవి)
ఉదధి - ఉదకమును ధరించునది (సముద్రం)
ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు (విష్ణువు)
ఉర్వి - పర్వతాలతో కప్పి ఉన్నది (భూమి)
ఉతాకం - నయన కాంతితో కాకులను దహించునది (గుడ్లగూబ)
ఔరసుడు - తనకు ధర్మపత్ని యందు పుట్టినవాడు (వారసుడైన పుత్రుడు)
లాంగలం - దున్నేటప్పుడు భూమిలో చొచ్చునది (నాగలి)
వాగ్మి - చతురంగా మాట్లాడే నేర్పు గలది/గలవాడు (చిలుక, బృహస్పతి)
సీరపాణి- నాగలి హస్తమునందు గలవాడు (బలరాముడు)
అలివేణి - తుమ్మెద వంటి నల్లని కురులు గలది (స్త్రీ)
పన్నగము- పాదములతో నడవనిది (పాము)
రత్నగర్భ- రత్నములు గర్భం నందు కలది (భూమి)
అపర్ణ - ఆకులను సైతం తినక కఠోర తపస్సు చేసింది (పార్వతి)
మర్త్యుడు- మృతి నొందువాడు (మానవుడు)
సరసిజనాభుడు - పద్మం నాభి యందు గలవాడు (విష్ణువు)
కమలిగర్భుడు - కమలం గర్భముగా గలవాడు (బ్రహ్మ)
హుతభుక్కు - హుతమును (హోమాగ్ని) భుజించువాడు (అగ్ని)
పుత్రుడు - పున్నామ నరకం నుంచి రక్షించేవాడు (కుమారుడు)
జీమూతం - దీని యందు నీరు బంధించి ఉంటుంది (మేఘం)
ఛాత్రుడు - గురువు దోషాలను ఛత్రం వలె కప్పిపుచ్చు శీలం గలవాడు (శిష్యుడు)
శివుడు = సాధువుల హృదయాన శయనించి ఉండువాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
పతివ్రత = పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది (సాధ్వి)
పురంధ్రి = గృహమును భరించునది (ఇల్లాలు)
అంగన = మంచి అవయవములు కలది (స్త్రీ)
ఈశుడు : ఐశ్వర్యయుక్తుడు (శివుడు)
అంబుదము : నీటిని ఇచ్చునది (మేఘము)
అంగన : మంచి అవయవములు కలది (స్త్రీ )
పతివ్రత : : పతి సేవయే వ్రతముగా కలది (సాధ్వి)
బ్రహ్మ:  ప్రజలను వర్థిల్ల చేయువాడు (విధాత)
జనని : జన్మనిచ్చునది (తల్లి)
             సంతానమును ఉత్పత్తి చేయునది (తల్లి)
దహనం : కాల్చుటకు సాధనమైనది (అగ్ని)
శివుడు: శుభములను కల్గించువాడు (శంకరుడు)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు