Pages

దుష్టులకు దూరంగా... భర్తృహరి సుభాషితాలు

దుష్టులకు దూరంగా... భర్తృహరి సుభాషితాలు

మన పూర్వులు చెప్పిన హితవాక్యాల్లో దుష్టులకు దూరంగా ఉండాలనేది ఒకటి. అదే విషయాన్ని తన నీతిశతకంలో చక్కటి ఉదాహరణతో భర్తృహరి చెప్పారు. 
దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపిసన్
మణినా భూషితః సర్వః కిమసౌ న భయంకరః
            ఈ సుభాషితాన్ని  ఏనుగు లక్ష్మణకవి..
విద్యచే భూషితుండయి వెలయుచున్న 
దొడరి వర్ణింపనగు జుమీ దుర్జనుడు
చారు మాణిక్యభూషిత శస్త మస్త కంబయిన
 పన్నగము భయంకరముగాదె?...

 అంటూ తెలుగువారికి మధురంగా అందించారు.
భావం: పాము నెత్తిమీద మణి ఎంతో ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ మణిని చూసి ముచ్చటపడి.. భయంకరమైన పాము జోలికి వెళితే కీడు ఎదురవుతుంది. అదేవిధంగా.. ఎంతటి విద్యావంతులైనప్పటికీ దుర్జనులైన వ్యక్తులకు దూరంగా ఉండాలి. పాండిత్యానికి ముగ్ధులై ఆశ్రయిస్తే... వారి క్రూరత్వానికి బలికాక తప్పదు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు