Pages

తెలుగు పద్యాలు - Telugu poems - ఇచ్చువాని వద్ద ఈని వాడుండిన

ఇచ్చువాని వద్ద ఈని వాడుండిన
చచ్చుగాని ఈవి సాగనీడు
కల్పతరువుకింద గచ్చ చెట్టున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావము : దానం ఇచ్చేవాడి పక్కన దానగుణం అసలు లేనివాడు ఉంటే ....
               వాడు ప్రాణం పోయిన దానం చేయనీయడు. "నువ్విచ్చిన పదిరూపాయల
               వల్ల ఆ బిచ్చగాడి జీవితం మారిపోతుందా? ఆ పదేదో నీ జేబులో ఉంటే
               మరో పనికి ఖర్చు చేయొచ్చు" అంటూ దానమిచ్చేవాడి మనసును
               మార్చేస్తాడు అని భావము. ఈ పద్యంలో ఈవి అంటే దానమని అర్థం.
               కల్పతరువు అంటే కోర్కెలు తీర్చే చెట్టు. గచ్చచెట్టు అనేది ఒక రకమైన
               ముళ్లచెట్టు. ఇది కల్పతరువు చెట్టు అల్లుకొని ఉంటే ........ ఆ కల్పతరువు
              అందించే ఫలాలు ఎవ్వరికీ అందవు. వృధాగా పోతాయి. కాబట్టి దానగుణం
               కలిగినవాడు ... ఆ గుణం లేనివాడికి వీలైనంత దూరముగా ఉండటమే మేలు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు