Pages

శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే

నన్నయ ఆంధ్రమహాభారతము ఈ సంస్కృత శ్లోకముతో ప్రారంభమైనది. ఇది త్రిమూర్తులను స్తుతిస్తూ చెప్పిన మంగళ శ్లోకం.
శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే 
లోకానాం స్థితి మావహ న్య్తవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం 
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్పంపూజితా వస్సురై 
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే. 

భావము: లక్ష్మీ సరస్వతీ పార్వతులను ఎవరు అనాదిగా వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరమునందును ధరించుచూ లోకములను నిరంతరాయంగ నిర్వహించుచున్నారో అట్టి మూడు వేదములను ఆకారముగా ధరించినవారును, దేవతలచే పూజింపబడువారును అగు విష్ణువు, బ్రహ్మ, శివుడు అను మువ్వురు పురుషోత్తములు మీకు శ్రేయస్సును కలిగింతురుగాక!
                                    నన్నయ తన కవిత్వంలో గల మూడు ప్రత్యేక గుణాలను ఈ పద్యం ద్వారా
 వివరించారు.  

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు