ఈ పద్యం పోతన భాగవతం లోని "గజేంద్ర మోక్షం" లోనిది.
కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో ? లేడో ?
భావము : దీనులను కాపాడటానికి ఉన్నాడంటారు. పరమయోగులలోను ఉన్నాడంటారు. నాలుగు దిక్కులలోను ఉన్నాడంటారు. 'ఉన్నాడు ఉన్నాడు' అనే ఆ ఈశ్వరుడు అసలు ఉన్నాడో లేడోనని గజేంద్రుడికి సందేహం(అనుమానం) వచ్చిందట అనే సందర్భం లోనిది ఈ పద్యం.
No comments:
Post a Comment