Pages

చిన్నారి చిట్టి గీతాలు - మంచి పాపాయి


చిట్టిపొట్టి పాపాయి
మంచి మాటలు వినవోయి
పొద్దున్నే మనమూ లేవాలి
పళ్ళూ బాగా తోమాలి
చక్కగ స్నానం చేయాలి
ఉతికిన బట్టలు కట్టాలి
తల్లితండ్రులను కొలవాలి
అమ్మకు సాయం చేయాలి
వేళకు బడికి పోవాలి
శ్రద్ధగ పాఠం చదవాలి
అల్లరి పనులు మానాలి
ఆటలు బాగా ఆడాలి
సోమరి తనము మానాలి
చక చక పనులు చేయాలి
పెద్ద చదువులు చదవాలి
గొప్ప పేరును తేవాలి. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు