Pages

ప్రశ్న - సమాధానం - తెలుగు ఆట

1. కూచిపూడి నాట్యకారులైన భార్యాభర్తలకు భారతదేశ ప్రభుత్వం సంయుక్తముగా "పద్మభూషణ్" పురస్కారం ఇచ్చింది. ఆ దంపతుల పేర్లు ఏమిటి? - జవాబు : రాధా రెడ్డి మరియు రాజారెడ్డి 
2. మంగళ వాద్యాలలో ఉండే ప్రధాన వాద్యాలు ఏమిటి? - జవాబు : నాదస్వరం & డోలు 
3. తెలుగు సంవత్సరముల ప్రకారం, మానవునికి ఆయుర్ధాయం ఎన్ని సంవత్సరములు అని చెపుతారు? జవాబు : 100 సంవత్సరములు / 120
4. సీతా స్వయంవరంలో శ్రీరాముడు ఈ విల్లును విరిచాడు? - జవాబు : శివధనస్సు 
5. షష్టి పూర్తికి  తెలుగు సంవత్సరాలతో ఉన్న సంబంధం ఏమిటి? - జవాబు - షష్టి పూర్తి జరుపుకున్న వ్యక్తి మళ్లీ తాను పుట్టిన తెలుగు సంవత్సరంలోకి అడుగుపెడతాడు. (షష్టి పూర్తి అనగా 60 సంవత్సరములు, తెలుగు సంవత్సరములు 60)
6. కొప్పురపు కవులుగా తెలుగు అవధాన ప్రక్రియలో ప్రసిద్ది చెందిన జంట సోదరుల పూర్తి పేర్లు ఏమిటి?- జవాబు : కొప్పురపు సుబ్బరాయ శర్మ, కొప్పురపు వెంకట రమణ 
7. సంవత్సరమునకు ఆయనములు ఎన్ని? అవిఏవి? - జవాబు : రెండు; ఉత్తరాయణం & దక్షిణాయణం 
8. పెళ్లి సమయంలో వధూవరులకు ఏ నక్షత్రాన్ని  చూపిస్తారు? - జవాబు : అరుంధతి 
9. ప్రముఖ తెలుగు సాహితీ వేత్త "పాప" అనే కలం పేరుతో సుపరిచితుడు అయిన రచయిత ఎవరు? - జవాబు : పాలగుమ్మి పద్మరాజు. 
10. కలం పేరు "చాసో" అసలు పేరు ఏమిటి? - జవాబు : చాగంటి సోమయాజులు 
11. శ్రీనాధుడు ఏ ప్రభువు కొలువులో ఆస్థాన కవిగా ఉన్నారు? జవాబు : కొండవీటి ప్రభువు(సర్వజ్ఞ సింగభూపాలుడు)
12. శ్రీనాథుని గురించి "ఋషి వంటి నన్నయ్య, రెండవ వాల్మీకి" అన్న కవి పేరు ఏమిటి? - జవాబు - విశ్వనాథ సత్యనారాయణ 
13. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ఒక పండితుని ఓడించి అతని కంచుఢక్కా ను పగల గొట్టించాడు శ్రీనాథుడు. ఆ పండితుని పేరు ఏమిటి? - జవాబు : గౌడ డిండిమ భట్టు 
14. తెలుగు సాహిత్యంలో పంచకావ్యములలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన శ్రీనాథుని కావ్యం పేరు ఏమిటి? - జవాబు : శృంగార నైషధము 
15. కలం పేరు "ఓల్గా" అసలు పేరు ఏమిటి? - జవాబు : పి. లలిత కుమారి(ప్రముఖ స్త్రీవాద రచయిత్రి)
16. ప్రాచీన కాలంలో రాచకన్యలు వరుడిని ఎంపిక చేసుకొనే ప్రక్రియ ఏమిటి?- జవాబు : స్వయంవరం 
17. మంగళ సూత్రానికి మరొక పేరు ఏమిటి? - జవాబు : పుస్తె (లేదా) తాళి 
18ఈ రోజు పౌర్ణమి, చంద్రుడు కృతిక నక్షత్రంలో ఉన్నాడు. మరి ఈ నెల పేరు ఏమిటి? - జవాబు : కార్తీక మాసం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు