తెలుగు పద్యం - సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ
సంపదలు కల్గు తరి మహాజనుల హృదయమభినవోత్సల కోమలంబగుచు వెలయు
నాపదలు వొందునపుడు మహా మహీధ
రాశ్మ సంఘాతకర్కశంబై తనర్చు.
భావము : సంపదలు కలిగినప్పుడు మహాత్ముల మనస్సులు కలువల వలె మృదువుగా ఉంటాయి.
ఆపదలు వచ్చినప్పుడు మాత్రం పెద్ద కొండకాళ్ల వలె కఠినముగా ఉంటాయి. అంటే
సంపదలు వచ్చినప్పుడు గర్వించి కఠినముగా ప్రవర్తించరనీ, ఆపదలు వచ్చినప్పుడు
వెలవెలబోరనీ భావం.
No comments:
Post a Comment