భాస్కర శతక పద్యం - ఉరుకరుణాయుతుండు
ఉరుకరుణాయుతుండు సమయోచితమాత్మదలంచియుగ్ర వా
క్పరుషతజూపినన్ ఫలముగల్గుట తథ్యము గాదె, యంబుదం
బురిమినయంతనే కురియ కుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెరుంగ భాస్కరా
తాత్పర్యము : మేఘము భయంకరముగా నురిమి తుదకు జనులను రక్షించుటకు వర్షం కురియును. అట్లే దయామయుడగు దొర సమయము కొలది కఠినముగా మాట్లాడినను తుదకు మేలునే చేయును.
No comments:
Post a Comment