Pages

Bhaskara Shataka Padyalu - ఎడపక దుర్జనుం డొరుల

భాస్కర శతక పద్యాలు - ఎడపక దుర్జనుం డొరుల 
ఎడపక దుర్జనుం డొరుల కెంతయుఁ గీ డొనరించుఁ గాని యే
యెడలను మేలు సేయఁ డొక యించుక యైనను జీడపుర్వు దాఁ
జెడదిను నింతె కాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే
పొడ వగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!

తాత్పర్యము : చీడపురుగు మిక్కిలి పండ్లతోను పుష్ఫములతోనుగల చెట్టును ఎల్లప్పుడు విడువకుండా ఆ చెట్టు నాశనమగునట్లు తినుచుండును. కాని అది రవ్వంత నీళ్ళైనను పోసి పెంచునా? అట్లే దుర్మార్గుడు ఇతరుల కపకారమునే చేయునుగాని వారి కుపకారమును ఎన్నడునూ చేయడు.   

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు