Pages

Bhaskara Shatakam - ఎట్టుగఁ బాటుపడ్డ

భాస్కర శతక పద్యాలు - ఎట్టుగఁ బాటుపడ్డ 
ఎట్టుగఁ బాటుపడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్ 
పట్టువడంగ నేరవు నిబద్ధిత సురావళి గూడి రాక్షసుల్ 
గట్టు పెకల్చిపాల్కడలి గవ్వము చేసి మధించి రంతయున్ 
వెట్టియు కాక యే మనుభవించిరి వా రమృతంము భాస్కరా

తాత్పర్యము : రాక్షసులు దేవతలతో కూడి యమృతమందలి యాశచే మందర పర్వతమును పెల్లగించి తెచ్చి సముద్రమును తరిచి కూలినేని చాకిరి చేసిరేకాని, దానిని తామనుభవింపలేకపోయిరి. కావున యేవరెంత కష్టపడినను, వారికి అదృష్టము లేనిచో తామాశించిన ఫలమును పొందలేరు.  

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు