Pages

Sumati Shataka Padyalu - అడిగిన జీతం బియ్యని

సుమతీ శతకము - అడిగిన జీతం బియ్యని 
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ!

భావం: కష్టానికి  తగిన వేతనం ఇవ్వని యజమాని దగ్గర పనిచేసే కన్నా సొంతంగా ఎద్దులతో వ్యవసాయం చేసుకొని బతకడం ఉత్తమం. పనికి తగిన వేతనం ఇవ్వనప్పుడు ఆ పని చేయడం వ్యర్థమని నీతి. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు