మండలపతి సముఖంబున - సుమతీ పద్యం
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ
భావం : పెద్దదైన ఏనుగు తొండం లేకుండా ఏమైనా పని చేయగలదా? లేదు కదా! రాజు, మంత్రి ఇద్దరూ తెలివిగలవారు అయినప్పుడే రాజ్యం పేరొందుతుంది. ఏ ఒక్కరు అవివేకి అయినా, ఏనుగుకు తొండం లేనట్లేనని భావం.
No comments:
Post a Comment