కనకపు సింహాసనమున - సుమతీ పద్యం
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
భావం: మంచి ముహూర్తం చూసి, ఓ కుక్కను తీసుకొచ్చి, సింహాసనం మీద కూర్చో బెట్టి, రాజుగా పట్టాభిషేకం చేసినంత మాత్రాన, అది సహజ స్వభావాన్ని విడిచిపెట్టదు. అలాగే... ఎవరేమి చేసినా నీచుడి సహజ బుద్ది ఎక్కడికీ పోదని ఈ పద్య భావం.
No comments:
Post a Comment