Pages

భర్తృహరి సుభాషితాలు - ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియున్

 భర్తృహరి సుభాషితాలు - ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియున్ 

ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియున్ 
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజి బా 
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం
ఛా పరివృద్ధియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జనాళికిన్ 
అర్థం: ఆపదలు వచ్చినపుడు ధైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చాతుర్యము, యుద్ధము నందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్ప కోరిక అనునవి మహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు