జనజీవన మాధ్యమాల వేదిక - మన సామెతలు
చెరపకురా చెడేవు
నోరు మంచిదైనా ఊరు మంచిదవును.
కలిమి లేములు కావడి కుండలు
తల్లిని మించిన దైవము లేదు
విద్య లేని వాడు వింత పశువు
కల్లలాడరాదు
గురువును నిందించరాదు
అడుసు తొక్కనేల కాలు కడుగనేల
అనువు గాని చోట అధికుల మన రాదు.
అప్పులేని వాడే అధిక సంపన్నుడు
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
అయిన వారికి ఆకుల్లోను కానివారికి కంచాల్లోను
అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?
అయ్యవారిని చేయబోతే కోతి అయింది
తాడి ఎక్కేవానికి తల తన్నే వాడొకడు.
తెలుగు పలుకులు తేనె చినుకులు.
అదను ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు
అందని మ్రాని పండ్లకు ఆశ పడరాదు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
శంఖం లో పోస్తే గాని తీర్థం కాదు.
ఎవరి వెర్రి వారికి ఆనందం.
ఆదిలోనే హంస పాదు.
ఇంట గెలిచి రచ్చ గెలుపు.
అదుగో తోక అంటే ఇదుగో పులి.
మెరిసేదంతా బంగారం కాదు.
అన్ని దానాలలోకి అన్న దానం మిన్న.
కుక్కతోక పట్టి గోదావరి ఈదలేం.
కడవ నిండా తీయని నీరు, చెరువు నిండా తామర పూలు.
చిలకా!చిలకా!ఎగిరెగిరి పోకు, బీరా!బీరా!పందిరికి పాకు.
జూలో పులిది ఆకలి గోడు, కాకుల కుంది చెదరని గూడు.
వీరకృపాణం తళతళ మెరిసె, నెమలికి పించం మిలమిల మెరిసె.
| చేతిలోది లేత చేలోది ముదురు. |
| కోడి గుడ్డుకు ఈకలు లాగినట్టు. |
| కామెర్ల రోగికి లోకమంత పచ్చనే. |
| చెక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు. |
| కొనగా తీరనిది కొసరగా తీరునా! |
| జుట్టున్నమ్మ కొప్పెంతైనా పెడుతుంది. |
| కోడిగుడ్డు పగలకొట్ట గుండ్రాయి కావలెనా? |
| కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు. |
| చేసుకున్న వారికి చేసుకొన్నంత మహాదేవ. |
| కోడి నలుపైనా గుడ్డు తెలుపే. |
| డబ్బులేని వాడే ముందు పడవెక్కేది! |
| కోటి విద్యలు కూటి కొరకే. |
| కందకు లేని దురద కత్తిపీట కెందుకు? |
| జోగీయోగీ రాచుకుంటే బూడిద రాలుతుంది. |
| కోతికి అద్దం చూపినట్లు. |
| తనదాకవస్తేగాని తలనొప్పి బాధ తెలీదు! |
| కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. |
| కట్టె వంకరను పొయ్యి తీరుస్తుంది. |
| తడిగుడ్డతో గొంతు కోయుట. |
| కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు. |
| క్షేత్రమెరిగి విత్తనం, పాత్ర యెరిగి దానం. |
| కడుపు కూటికి ఏడిస్తే కొప్పుపూలకి ఏడ్చిందంట. |
| తన దీపమని ముద్దు పెట్టుకొన్నట్టు. |
| కోతి పుండు బ్రహ్మ రాక్షసి. |
| తల తాకట్టు పెట్టుట. |
| గంతకు తగిన బొంత. |
| కన్ను ఉండగా పాప తీయుట. |
| తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. |
| గతిలేనమ్మకు గంజియే పానకం. |
| కత్తి మీద సాము. |
| గాజుల బేరం బువ్వకు సరి. |
| కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. |
| తలపాగా చుట్టడం రాక తల వంకరన్నట్టు. |
| గతిలేనమ్మకు మతిలేని మొగుడు. |
| గాడిద పుండుకు చూడిద మందు. |
| కాకరచెట్టుకు పానకం పోసినట్టు. |
| తలుపులేని ఇంట్లో కుక్క దూరినట్లు. |
| గాడిదకు గడ్డి వేసి, ఆవును పాలిమ్మనట్లు. |
| కలిమిలేములు కావడి కుండలు. |
| గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తిననేర్పవలెనా. |
| కాకి ముక్కుకు దొండపండు. |
| తల్లి పెట్టెలు మేనమామ దగ్గర పొగిడినట్టు. |
| గాలిలో మేడలు కట్టినట్లు. |
| కాకి బిడ్డ కాకికి ముద్దు గదా! |
| గుండ్రాయిదాస్తే పెళ్లి ఆగిపోతుందా! |
| కాగల కార్యం గంధర్వులే తీర్చారు. |
| తల్లికి కూడు పెట్టనివాడు పిన తల్లికి చీర పెట్టాడట! |
| గొఱ్ఱె ఏడిస్తే తోడేలుకు విచారమా. |
| కాకి గూటిలో కోయిల పిల్ల వలె. |
| గుడ్డి కన్నా మెల్ల మేలు. |
| కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి. |
| గుడినీ గుడిలో లింగాన్ని మింగేసాడు. |
| కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. |
| తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు. |
| కాలు జారినా తీసుకోగలం నోరు జారితే తీసుకోలేం. |
| తాడిని తన్నువాడిని తలదన్నే వాడుంటాడు. |
| గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు. |
| కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి. |
| కాశీకి పోయినా కర్మ తప్పదు. |
| తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, |
| గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. |
| తాతకు దగ్గులు నేర్వనగునా ! |
| కాసుంటే మార్గం ఉంటుంది. |
| తానొకటి తలస్తే దైవమొకటి తలచును. |
| గురివింద తన కింద నలుపు తా నెరుగదు గదా! |
| కీలెరిగి వాత పెట్టినట్టు |
| తాను వలచింది రంభ, మునిగింది గంగ. |
| తినబోతూ రుచి అడగవేల ! |
| చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు. |
| కొత్తిక వింత పాతొక రోత. |
| కననిది బిడ్డ కాదు కట్టనిది చీర కాదు. |
| చెవిటి వానివద్ద శంఖం ఊదినట్టు. |
| కొరివితో తల గోక్కున్నట్టు. |
| గురువుకే పంగనామాలు పెట్టినట్టు. |
| కాశీకి వెళ్ళి గాడిద గుడ్డును తీసుకువచ్చినట్టు. |
| గుడ్డు వచ్చి పిల్లను వెక్కింరించనట్టు. |
| తాడి చెట్టు కింద పాలు తాగినట్టు. |
| తాచెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు. |
| తల్లిగూనిదైతే పిల్లగూనిదౌనా ! |
| తన బలము కన్నా స్థాన బలము మిన్న. |
| తలప్రాణం తోకకు వచ్చుట. |
| కయ్యానికయినా వియ్యానికయినా సమవుజ్జీ ఉండాలి. |
| తన్నితే బూరెల గంపలో పడ్డట్టు. |
| కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ. |
| కక్కు వచ్చినా కళ్యాణ గడియ వచ్చినా ఆగవు. |
| కంచే చేను మేస్తే ఏలాగు! |
| కాలే కడుపుకు మండే గంజి. |
| కల్గినవానికి అందరూ చుట్టాలే. |
| కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు. |
| పొట్టోనికి పుట్టెడు బుద్ధులు. |
| అరచేయంత బీరకాయకు అడ్డాశేరు మసాలా! |
| ఉన్నదున్నట్లు అనరాదు, ఊళ్లో ఉండరాదు |
| దమ్ము లేనోడు దుమ్ముల చేయి వెట్టిండు. |
| తొలిచూలు పిల్లకు తొంభై అంగీలు, మరుచూలు పిల్లకు మారు అంగీ లేదు. |
| గరక చెడతాది కాని గాడిద చెడతాదా? |
| వియ్యపోళ్ళు వియ్యపోళ్ళు ఒకటుంటే దయ్యం వచ్చి కయ్యం పెట్టింది. |
| అ ఆ లు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట! |
| కోటి విద్యలు కూటి కొరకే! |
| ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు. |
| ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెడలో తాళి కట్టినట్టు |
| అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు |
| పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. |
| నిద్ర సుఖ మెరుగదు, ఆకలి రుచెరుగదు! |
| కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు! |
| అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. |
| అంగిట బెల్లం ఆత్మలో విషం |
| అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు! |
| శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు |
| విత్తు ఒకటేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా! |
| అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! |
| అడిగే వాడికి చెప్పేవాడు లోకువ |
| అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు |
| ఎంత చెట్టుకు అంత గాలి |
| చెప్పులో రాయి చెవిలో జోరీగ |
| నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. |
| తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు. |
| రాజు కంటే మొండివాడు బలవంతుడు. |
| అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు? |
| ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండదు. |
| చదువక ముందు కాకరకాయ, చదివిన తరువాత కీకర కాయ. |
| పట్టుకోక ఇచ్చినమ్మ పీట కోడు పట్టుకు తిరిగినట్టు ...... |
| ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట! |
| అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా! |
| కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు! |
| ఆసోది మాటలకు అంతం లేదు, గుడ్డి కంటికి చూపు లేదు |
| ఆచారానికి అంతం లేదు, అనాచారానికి ఆది లేదు |
| సంగీతానికి గాడిద...... హాస్యానికి కోతి అన్నట్లు! |
| అడుసు తొక్కనేల........ కాలు కడగనేల! |
| అరనిమిషం తీరికా లేదు........ అర కాసు సంపాదనా లేదు! |
| కుండ మోయలేనివాడు........ బండను మోయడానికి వెళ్లినట్లు! |
| కుక్కకు పెత్తనమిస్తే ...... ఇంట్లో చెప్పులన్నీ కొరికిందట! |
| గాయపడిన చేయి పని చేయగలదేమో కానీ, హృదయం పని చేయదు. |
| మిత్రుడి కంటిని మించిన అద్దం లేదు |
| కొందరిని పాతేసినా ......... విత్తనాలై మళ్లీ మొలకెత్తుతారు! |
| అంగడి అమ్మి గొంగడి కొన్నట్లు! |
| అదిగో తెల్లకాకి అంటే........ ఇదిగో పిల్లకాకి అన్నట్లు! |
| అంతా తెలిసిన వాడు లేడు! ఏమీ తెలియని వాడు లేడు! |
| పనిగలవాడు పందిరివేస్తే ........ కుక్క తోక తగిలి కూలిపోయిందట! |
| నేల విడిచి సాము! నీరు విడిచి ఈత! |
| మరచిపోయి మజ్జిగలో చల్ల పోశాను అన్నట్లు! |
| నోటితో నవ్వడం! నొసలుతో వెక్కిరించడం! |
| గుమ్మడికాయంత తెలివి కంటే, గురివిందగింజంత అదృష్టం మేలు. |
| అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రి గొడుగు పట్టమన్నాడట |
| నయము నష్టకారి భయము భాగ్యకారి |
| అసాధ్యమనే మాట సత్య దూరం |
| తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు |
| వానరాకడ ప్రాణం పోకడ తెలియదు |
| ముంజేతి కంకణమునకు అద్దమెందుకు |
| అన్నీ ఉన్న విస్తరి అణిగి యుండును |
| రాళ్ళున్న గనిలోనే రత్నాలుంటాయి |
| విత్తనము ఒకటయిన మొక్క వేరగునా |
| తా చెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు |
| కూసే గాడిద మేసే గాడిదను చెరచినట్లు |
| అనుమానం పెనుభూతం |
| అద్దం మీద ఆవగింజ |
| అద్దెకు వచ్చిన గుఱ్ఱం అగడ్త దాటుతుందా! |
| అద్దం అబద్దం ఆడుతుందా! |
| అదిగో తోక అంటే ఇదిగో పులి |
| అదిగో అంటే ఆరు నెలలు |
| అతి రహస్యం బట్ట బయలు |
| అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న |
| అడ్డాల నాటి బిడ్డగాని గడ్డాల నాటి బిడ్డ గాదు! |
| అడిగే వాడికి చెప్పేవాడు లోకువ |
| అడగందే అమ్మయినా అన్నం పెట్టదు |
| అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్లి |
| అగ్నిహోత్రం లో ఆజ్యం పోసినట్లు |
| అగ్నిలో మిడత పడినట్లు |
| అగ్నికి వాయువు తోడైనట్లు |
| చుట్టమై వచ్చి దయ్యమై పట్టాడట. |
| తల విలువ నోరు చెబుతుంది. |
| గుఱ్ఱం తోక బెత్తెడు, కుక్క తోక వంకర. |
| అభాగ్యునికి ఆకలి ఎక్కువ. |
| తనది అయితే సోమవారం, మందిది అయితే మంగళవారం |
| తలపాగ చుట్టరాక తలే వంకరుంది అన్నాడట . |
| అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకొని నోరు ఊరుకోవు. |
| కాలు జారితే తీసుకోగలము కాని, నోరు జారితే తీసుకోగలమా |
| కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు |
| కాకి పిల్ల కాకికి ముద్దు |
| కలిమి లేములు కావడికుండలు |
| కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును. |
| కందకు లేని దురద బచ్చలికెందుకు? |
| కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ! |
| ఏ గాలికి ఆ చాప |
| ఒక ఒరలో రెండు కత్తు లిముడవు ! |
| ఏకులు పెడితే బుట్టలు చిరుగునా? |
| ఎద్దు పుండు కాకికి ముద్దా? |
| ఎక్కడైనా బావకాని వంగతోట దగ్గర మాత్రంకాదు |
| ఋణశేషము, శత్రుశేషము ఉంచరాదు |
| ఊరంతా చుట్టాలు, ఉట్టికట్ట తావులేదు |
| ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు |
| ఉపకారనికిపోతే అపకారమెదురైనట్లు |
| ఉడుతకు ఉడతాభక్తి |
| ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేక్కునా? |
| ఇంటిపేరు కస్తురివారు - ఇంట్లో గబ్బిలాల కంపు |
| ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు |
| ఇంట తిని ఇంటివాసాలు లెక్కపెట్టినట్లు |
| ఇంట గెలిచి రచ్చ గెలువు |
| అంగటిలో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని |
| అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు |
| అందని పండ్లకు అర్రులు చాచినట్లు |
| అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ |
| అందరిదీ ఒక దారి ఉపిలి కట్టెదొక దారి! |
| అందితే సిగ అందకపోతే కాళ్ళు |
| అంధునకు అద్దం చూపినట్లు |
| అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తే వాడొకడు |
| అగడ్తలో పిల్లికి అదే వైకుంఠము |
| అగ్గిమీద గుగ్గిలం అయినట్లు |
| ఉన్న ఊరు కన్నతల్లి వంటిది : వివరణ : మన అవసరాలను అడగకుండానే తీర్చేది తల్లి. మనం నివసించే ఊరిలో మనకు అవసరమైనన్ని లభిస్తాయి . కనుక ఉన్న ఊరు కన్నతల్లితో సమానం. |
| ఉపాయం ఉన్నవాడు ఊరి మీద బతుకుతాడు : వివరణ : ఉపాయం ఉంటే గొడవలను నివారించవచ్చు. కష్టాలను పరిష్కరించుకోవచ్చు. అందరితో స్నేహముగా ఉండవచ్చు. అటువంటి వారిని ఊరిలోని వారందరూ ఇష్టపడతారు. |
| ఏడు మెతుకులు తింటే, ఏనుగంత సత్తువ : వివరణ : కొంచమైనా ఆహారం తీసుకుంటే శక్తి వస్తుంది. ఆహారం శరీరానికి బలం చేకూరుస్తుంది. |
| ఒంటె కంటె, జంట మేలు : వివరణ : ఒక్కరే ఉండటం కన్నా ఇద్దరుగా ఉండటం మేలు. ఒకరికి ఇంకొకరు తోడుగా ఉంటారు. |
నోరు మంచిదైనా ఊరు మంచిదవును.
కలిమి లేములు కావడి కుండలు
తల్లిని మించిన దైవము లేదు
విద్య లేని వాడు వింత పశువు
కల్లలాడరాదు
గురువును నిందించరాదు
అడుసు తొక్కనేల కాలు కడుగనేల
అనువు గాని చోట అధికుల మన రాదు.
అప్పులేని వాడే అధిక సంపన్నుడు
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
అయిన వారికి ఆకుల్లోను కానివారికి కంచాల్లోను
అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?
అయ్యవారిని చేయబోతే కోతి అయింది
తాడి ఎక్కేవానికి తల తన్నే వాడొకడు.
తెలుగు పలుకులు తేనె చినుకులు.
అదను ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు
అందని మ్రాని పండ్లకు ఆశ పడరాదు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
శంఖం లో పోస్తే గాని తీర్థం కాదు.
ఎవరి వెర్రి వారికి ఆనందం.
ఆదిలోనే హంస పాదు.
ఇంట గెలిచి రచ్చ గెలుపు.
అదుగో తోక అంటే ఇదుగో పులి.
మెరిసేదంతా బంగారం కాదు.
అన్ని దానాలలోకి అన్న దానం మిన్న.
కుక్కతోక పట్టి గోదావరి ఈదలేం.
కడవ నిండా తీయని నీరు, చెరువు నిండా తామర పూలు.
చిలకా!చిలకా!ఎగిరెగిరి పోకు, బీరా!బీరా!పందిరికి పాకు.
జూలో పులిది ఆకలి గోడు, కాకుల కుంది చెదరని గూడు.
వీరకృపాణం తళతళ మెరిసె, నెమలికి పించం మిలమిల మెరిసె.
No comments:
Post a Comment