Pages

భర్తృహరి పద్యం - పండిత వాక్కు

భర్తృహరి పద్యం - పండిత వాక్కు 

అతిగా మాట్లాడేవారిని లోకం పట్టించుకోదు.అవసరమైన మేరకు అవసరమైనంత మాట్లాడితేనే ఆ మాటలకూ ఆ వ్యక్తికీ విలువ ఉంటుంది.ఈ లక్షణం పండితులకు ఉంటుందని భర్తృహరి ఎంత

చక్కగా వివరించాడో చూడండి.  

  కరోతు కరట శ్శబ్దమ్, 

సర్వదా ప్రాంగణే వసన్,

శశృణోతి బుధః ప్రీత్యా

శృణోతి పిక భాషితమ్.

అర్థం:కాకులు నిత్యం ఇంటి పెరట్లోనే ఉంటూ కావుకావు మంటూ అరుస్తూ ఉంటాయి. ఆ అరుపులను ఎవరూ ఇష్టంగా  వినరు. అదే, కోకిలను తీసుకోండి... ఎప్పుడో ఒకసారి గళాన్ని విప్పుతుంది. మధురంగా కుహూ కుహూ  అని కూస్తుంది. ఆ స్వరాన్ని విని అందరూ సంతోషపడతారు- అని భావం. 

           లోకం తీరు కూడా ఇంతే.అతిగా అనవసరంగా వాగే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. అందుకే పండితులూ జ్ఞాన సంపన్నులూ అవసరమైన మేరకే మితంగా మాట్లాడతారు. ఆ మాటలను అందరూ ఎంతో ప్రీతితో గౌరవంతో వింటారు. 


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు