Pages

Showing posts with label బాలల గేయం. Show all posts
Showing posts with label బాలల గేయం. Show all posts

కొంటె కోతి - తెలుగు గేయాలు

కోతిబావ నీకు కాస్త కోపమెక్కువ
కొంటెపనులు అంటె నీకు కోరికెక్కువ
చిలిపివాళ్లు పలుకరిస్తే చిందులెక్కువ
అరటిపళ్లు చూస్తే చాలు ఆశలెక్కువ
పిందేలన్ని తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ
కాని పనులు చేయుటలో గర్వమెక్కువ
కొబ్బరంటే చాలు నీకు ఇష్టమెక్కువ
రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువ
దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ
కర్రపుల్ల చూడగానే కంపమెక్కువ
గుణములన్ని ఎంచిచూడ కుదురు తక్కువ
గుడి గోపురమెక్కితే గంతులెక్కువ

తెలుగు నెలల పాట

నెలలండి నెలలు తెలుగు నెలలు
పన్నెండు నెలలండి తెలుగు నెలలు

చైత్రం - వైశాఖం
జ్యేష్టం - ఆషాడం
శ్రావణం - భాద్రపదం                                          //నెలలండి//

ఆశ్వయుజం - కార్తీకం
మార్గశిరం - పుష్యం
మాఘం - ఫాల్గుణం                                         //నెలలండి//



బాలల గేయం 5

కలువ పూవు తెలుపు
బంతి పూవు పసుపు
గులాబీలు ఎరుపు
పూలమాలగా కలుపు 

పూచిన పూలు - బాలల గేయం 4




పూచిన పూలూ ఏమన్నాయి?
విచ్చిన పూలూ ఏమన్నాయి?

పిల్లల్లారా రమ్మన్నాయి!
లచ్చికి దండలు గుచ్చన్నాయి!

రోజా పూలూ ఏమన్నాయి?
జాజీ పూలూ ఏమన్నాయి?

రాజూ రాణికి ఇమ్మన్నాయి!
మోజుగా వాసన చూడన్నాయి!

బంతీ పూలూ ఏమన్నాయి?
చామంతీ పూలూ ఏమన్నాయి?

బంతులాటా ఆడన్నాయి!
పూబంతులాటా ఆడన్నాయి!  
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు