Pages

Showing posts with label geyalu. Show all posts
Showing posts with label geyalu. Show all posts

Tastes - Kids Geetalu

రుచులు - గేయం 
మామిడి పండు తీపి - ద్రాక్షపండు తీపి 
జామపండు తీపి - ఆపిల్ పండు తీపి 
చింతచిగురు పులుపు - చింతకాయ పులుపు 
నారింజ పులుపు - నిమ్మకాయ పులుపు 
కాకరకాయ చేదు - కాకరాకు చేదు 
వేపకాయ చేదు - వేపాకు మహా చేదు 
వెలక్కాయ వగరు - ఉసిరికాయ వగరు 
కరక్కాయ వగరు - నేరేడు కూడ వగరు 
మిరియాలు కారం - మిరప్పండు కారం 
వండిన కూర కారం - ఎండిన లవంగ కారం 
సముద్రం నీరు ఉప్పు - పట్టిన చెమట ఉప్పు 
వచ్చే కన్నీరు ఉప్పు - తెలియని మంట ఉప్పు 

Our Festivals - Kids Geetalu

మన పండుగలు - గేయం 
దసరా పండుగ వచ్చినది 
దర్జాలెన్నో తెచ్చినది 
దండిగ డబ్బులు వచ్చినవి 
కోరికలన్నీ తీరినవి 
                   సంక్రాంతి పండుగ వచ్చినది 
                   సరదాలెన్నో తెచ్చినది 
                  కొత్త బట్టలు కట్టాము 
                  బహుమతులెన్నో పొందాము 
దీపావళి పండుగ వచ్చినది
దివిటీ లెన్నో వెలిగించినది 
చీకటినంతా పారద్రోలి 
చిరంజీవిగా నిలిచినది 
                   ఉగాది పండుగ వచ్చింది 
                   జగాన వెలుగు నిండింది 
                   చేదు, తీపి గుర్తులతో 
                   జీవితమంతా సాగింది. 

White - Kids Geetalu

తెలుపు - గేయం 
అమ్మమాట తెలుపు - ఆవుపాలు తెలుపు 
మల్లెపూవు తెలుపు - మంచిమాట తెలుపు 
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు 
మంచిమనసు తెలుపు -  పావురాయి తెలుపు 
పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు 
గురువు చొక్కా తెలుపు - గోవిందనామము తెలుపు 
జాజిపూలు తెలుపు - జాబిల్లి తెలుపు 
జాలి గుండె తెలుపు - చల్లనైన మంచు తెలుపు 
వెన్నెలమ్మ తెలుపు - వేప పువ్వు తెలుపు 
మంచి ముత్యం తెలుపు - పాపాయి నవ్వు తెలుపు 

Colours - Kids Geetalu

రంగులు - గేయం 
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు 
మల్లెపువ్వు తెలుపు - మంచిమనసు తెలుపు
మందారం ఎరుపు - సింధూరం ఎరుపు 
మంకెనపువ్వు ఎరుపు - మంచి మంట ఎరుపు 
జీడిగింజ నలుపు - కట్టె బొగ్గు నలుపు 
కారుచీకటి నలుపు - కాకమ్మ నలుపు 
చామంతి పసుపు -పూబంతి పసుపు 
బంగారం పసుపు - గన్నేరు పసుపు 
సన్నజాజి తెలుపు - చామంతి పసుపు
మందారం ఎరుపు - కోకిలమ్మ నలుపు 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు