గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో, వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. |
నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. |
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం. |
అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. |
మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు. అంతేకానీ జన్మతః కాదు. |
మనిషి వ్యక్తిత్వాన్ని అతని వృత్తితో కాకుండా, ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. |
పొరపాటు చేయని ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ఆలోచించలేడు. |
శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు. |
మనది కాని వస్తువు పై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. |
ప్రపంచాన్ని మార్చాలంటే శక్తిమంతమైన ఆయుధం చదువొక్కటే! |
వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా, శాంతిని, కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు! |
ఎంత సేపు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్దగా చదివామన్నదే ముఖ్యం. |
ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు. ముందు నువ్వు మారడం ముఖ్యం. |
ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. |
నిన్న నుంచి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు. |
జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. |
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పును నేర్చుకో. |
ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు. |
మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును. |
మంచి పనులకు పునాది క్రమశిక్షణ. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది. |
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. |
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే, ఆధారమైన దారం గురువు. |
ఇది ఛాలా క్లిష్టమైన సమస్య అనే సాకు వద్దు. క్లిష్టమైనది కాకపోతే అది సమస్య ఎందుకవుతుంది. |
విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతిచోటా గౌరవింపబడతాడు. |
నిరంతర సాధన ఫలితమే నైపుణ్యం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. |
అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, చివరకు భగవంతుని నుంచి దూరం చేస్తుంది. |
పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. కానీ మంచితనం ప్రతి దిక్కుకూ ప్రసరిస్తుంది. |
వెలిగే దీపం ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. |
కోపం రావడం సహజం. కాకపోతే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలిసి ఉండటమే విజ్ఞత. |
దేనినైనా ప్రేమతో చేసి చూడండి. అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది. |
మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి. |
విద్య నీడ లాంటిది. దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. |
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. |
వందమందికి నీవు సహాయ పడలేక పోవచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. |
నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తికి విజయాలు దక్కుతాయి . |
సంస్కారం లేని చదువు వాసన లేని పూవు లాంటిది |
క్రమశిక్షణ, ఐకమత్యం దేశానికి నిజమైన బలం |
అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. |
గమ్యాన్ని చేరుకోవడం కన్నా గమ్యం వైపు అడుగులు వేయడం ముఖ్యం. |
ప్రతి క్షణాన్నీ ఒక మధుర జ్ఞాపకంగా చూపించగలిగేది ఒక్క ఫోటో మాత్రమే. |
సాధించాలనే తీవ్రమైన తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. |
మనుషులను చంపగలరేమో గానీ, వారి ఆదర్శాలను మాత్రం కాదు. |
విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతిచోటా గౌరవాన్ని పొందుతాడు. |
ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటిని నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. |
అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. |
ఇతరులను జయించటం కంటే తన మనసును తాను జయించటం కష్టం . |
సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పదనము ఉంది. |
ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. |
మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే |
వేచి ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ అవి దూసుకుపోయే వాళ్లు వదిలేసినవి మాత్రమే. |
ఆత్మ విశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే, అదే ఆత్మ విశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. .. |
ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి......... దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి ......... దాన్నే ధ్యానించండి......... దాన్నే కలగనండి. దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. |
జీవితంలో భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండే వారు గొప్ప విజయాలు సాధించగలరు. |
వేలాది వ్యర్థమైన మాటలు వినే కన్నా......... శాంతిని, కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు. |
మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. |
నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు. |
లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. |
విజయానికి తొలిమెట్టు మనపై మనకు ఉన్న విశ్వాసం. |
మనస్ఫూర్తిగా పని చేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. |
ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఓ కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం. ఆ పుస్తకాన్ని మళ్లీ చదివితే చిరకాల మిత్రుని కలిసినంత ఆనందం. |
మన శక్తికన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. |
భయపడకు, నీవు ఎన్ని సార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో, నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో......... వెలుగు వచ్చే తీరుతుంది. |
వినడానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. |
ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ....... ఎప్పటికీ శాశ్వతం కాదు. |
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. ఆ కాలంలో మనం ఏం చేశాం! ఏలా ఉన్నాం!ఏం సాధించామన్నది ముఖ్యం. |
ప్రయత్నం చేసి ఓడిపో ........ కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు |
సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు, దుఃఖానికి స్వాగతం చెప్పి తీరాల్సిందే. |
జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు.కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే! |
అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తించుకోవాలో, ఎంత వరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. |
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. |
పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు.......!! |
విద్య లక్ష్యం సంపాదన కాదు, విద్య వివేకాన్ని, విమర్శనాశక్తిని అందించాలి. |
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. |
ఇతరులను జయించడం కన్నా, తనని తాను జయించడం చాలా కష్టం |
విజ్ఞానం ఉందని గర్వించటమంత అజ్ఞానం మరొకటి లేదు. |
ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం. |
ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. |
మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న వర్తమానంతో భవిష్యత్తు కోసం శ్రమించు! |
నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. |
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. |
నిన్ను చూసి చప్పట్లు కొట్టే పదివేళ్ల కన్నా నీ కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న. |
కష్టసుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారే స్వేచ్చగా జీవించగలరు. |
దేవుడు మనకు విజయాలనందివ్వడు. విజయం సాధించడానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. |
ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు. |
అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక!! |
లేని గొప్పతనం ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. |
అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని గ్రహిస్తాం. ఉత్తముల సాహచర్యమూ అంతే! |
మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలూ ఉన్నట్టే! |
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. |
జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది. |
మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. |
శరీరానికి మరణం ఒక్కసారే. కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే! |
ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. |
మనసు చెప్పినట్టు మనం వినడం కాదు........ మనం చెప్పినట్టు మనసు వినేలా చూసుకోవాలి. |
వినడానికి కటువుగా ఉన్నా....... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. |
ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం. కానీ, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. |
భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే......... భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. |
హృదయ సౌందర్యం లేని శరీర సౌందర్యం వ్యర్థం. |
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే........ ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనము చేస్తుంది. |
వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కానీ ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి. |
ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. |
నీ వెనక ఏముంది........ నీ ముందు ఏముంది ........ అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. |
వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది. |
మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం........ రెండూ నేరమే! |
మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. |
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. |
తక్కువ సంపాదన ఉన్నవారికన్నా తక్కువ ఉన్నవారికే ఇబ్బందులు వస్తాయి. |
నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. |
మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం అవుతుంది. |
తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. |
మనసులో అసూయ, ద్వేషాలు లేని వాళ్లను అందరూ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. |
ఏ పని చక్కగా చేయాలన్నా........ ముందు ఆ పనిలో ఆసక్తి ఉండాలి. |
నోట జారిన మాట, చేజారిన అవకాశం, గడిచిపోయిన కాలం తిరిగి లభించవు. |
ఏ పరిస్థితుల్లో ఉన్నా..... నీ కర్తవ్యం నీకు గుర్తుంటే ......... జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. |
పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. ఎందుకంటే....... అవి జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. |
మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనను భయపెట్టలేడు! |
మన శక్తిని తెలియజేసేది .... మన సామర్థ్యం. మనము ఏం చేయగలమో తెలిపేది. ఆత్మవిశ్వాసం. మనమేంటో నిర్ణయించేది........ మన వ్యక్తిత్వం. |
మనలోని లోపాలను ఎత్తి చూపేవాడే నిజమైన మిత్రుడు. |
చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. |
వినడానికి కటువుగా ఉన్నా ...... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. |
మన లోపాలను మనం తెలుసుకోవడమే అన్నింటికన్నా పెద్ద చదువు. |
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. కానీ ఆ కాలంలో మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నదే ముఖ్యం. |
చిన్న విషయమే కదా అని దేనినీ తేలికగా తీసుకోకూడదు. అతి పెద్ద ఓడను కూడా ఓ చిన్న రంధ్రం నిలువునా ముంచేస్తుంది. |
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. |
మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మన వెంటే ఉంటుంది, స్వశక్తిని మించిన ఆస్తి మరేది లేదు. |
ఈర్ష్య, అసూయలు కంట్లో నలుసులాంటివి, వాటిని మనలోంచి తొలగించినపుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. |
తన తల్లిని గాఢంగా ప్రేమించే వ్యక్తి జీవితాంతం విజేత మనస్తత్వంతో ఉంటాడు. |
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు |
కుక్క తోక పట్టి గోదావరి ఈదునట్లు |
బెల్లమున్న చోటికి చీమలు చేరినట్లు |
చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్మినట్లు |
తన బలిమి కన్నా స్థాన బలిమి మిన్న |
అనువు గాని చోట అధికుల మనరాదు |
కంచు మ్రోగినట్లు కనకం మ్రోగునా |
నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు |
అసత్యమాడుట పిరికి పందల గుణం |
నిజాన్ని నిర్భయముగా చెప్పవలెను |
Manchi Maata - మంచి మాట - సూక్తులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment