Pages

Showing posts with label సుమతీ శతకం. Show all posts
Showing posts with label సుమతీ శతకం. Show all posts

Sumati padyalu - వినదగు నెవ్వరు చెప్పిన

సుమతీ శతకము - వినదగు నెవ్వరు చెప్పిన 
వినదగు నెవ్వరు చెప్పిన 
వినినంతనె వేగపడక వివరింపదగున్ 
కని కల్ల నిజాము తెలిసిన 
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

భావము : ఎవరు ఏమి చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందర పడకుండా బాగా ఆలోచించాలి. 
                అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నవాడే తెలివయినవాడు. 

Sumati Satakamu - అల్లుని మంచితనంబును

సుమతీ శతకము - అల్లుని మంచితనంబును
అల్లుని మంచితనంబును 
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్ 
బొల్లున దంచిన బియ్యము 
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

భావము : అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును,  ఆడుదానియందు నిజమును,
                 పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులును లోకములో నుండవు.

Sumati Satakamu - అప్పిచ్చువాడు వైద్యుడు

సుమతీ శతకము - అప్పిచ్చువాడు వైద్యుడు
అప్పిచ్చువాడు వైద్యుడు 
నెప్పుడు నెడతెగక బారు నేరును, ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

భావము : ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండ ప్రవహించు 
               నదియును, బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసింపుము, వారు లేనట్టి 
                గ్రామమందు నివసింపకుము. 

Sumati Satakamu - కూరిమిగల దినములలో

సుమతీ శతకము - కూరిమిగల దినములలో 
 కూరిమిగల దినములలో 
నేరములెన్నడును గలుగనేరవు మరి యా 
కూరిమి విరసంబైనను 
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

భావము : స్నేహము బాగుగా నున్న రోజులలో ఆ స్నేహితులకు ఒకరు చేసిన పనులలో 
                మరొకరికి తప్పులు కనిపించవు. అదే స్నేహితులకు విరోధము వచ్చినప్పుడు 
                ఒకరి చేష్టలు మరొకరికి దోషములుగా కనిపించును!

Sumati Satakamu - ఉపకారికి నుపకారము

సుమతీ శతకము - ఉపకారికి నుపకారము 
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ !

భావము : మనకు ఉపకారము చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట మంచి
               లక్షణము. అంతేగాని అందులో ప్రత్యేకత ఏమి లేదు. కానీ అపకారము
               చేసిన వారిపై నెపములెన్నక తిరిగి వారికే ఉపకారము చేయగలిగినవాడే
               "నేర్పరి" అనిపించుకొనును. 

Sumati Satakam - మాటకు ప్రాణము సత్యము

సుమతీ శతకము - మాటకు ప్రాణము సత్యము
మాటకు ప్రాణము సత్యము 
కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన్ 
బోటికి ప్రాణము మానము 
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము  సుమతీ !

భావము : ఓ మంచిబుద్ధి గలవాడా ! మాటకు సత్యమే ప్రాణము. ఈ ప్రపంచమున 
               కోటకు ప్రాణము వీరులైన సైనికులే ఆగుదురు. స్త్రీకి శీలమే ప్రాణము.  
               అట్లే చీటికి సంతకమే ప్రాణము. అనగా సంతకము లేని చీటి వ్యర్థము. 

Sumati Satakam - తలనుండు విషము ఫణికిని

సుమతీ శతకము - తలనుండు విషము ఫణికిని
తలనుండు విషము ఫణికిని 
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్ 
తలతోక యనక యుండును 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

భావము : ఓ సుమతీ ! పామునకు తలయందు విషము ఉండును. తేలుకు విషము 
               తోకలో ఉండును. కానీ , దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు 
               విషము ఉండును. 

Sumati Satakam - కనకపు సింహాసనమున

సుమతీ శతకం - కనకపు సింహాసనమున 
కనకపు సింహాసనమున 
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం 
దొనరగ బట్టము కట్టిన 
వెనుకటి గుణ మేల మాను వినురా సుమతీ !

భావము : ఓ మంచిబుద్ధి గలవాడ ! కుక్కది హీనగుణము. దానిని మంచి ముహూర్తము నాడు బంగారపు 
                సింహాసనమున కూర్చుండబెట్టినను హీనబుద్ధి విడవదు. అట్లే హీనుని ఉన్నత స్థానమున 
                కూర్చుండబెట్టినను అతని బుద్ధి మారదు. 

Telugu Kiranaalu - Sumati Satakam - కూరిమిగల దినములలో

సుమతీ  శతకం - కూరిమిగల దినములలో

కూరిమిగల దినములలో 
నేరము లెన్నడును గలుగ నేరవు ; మఱియా 
కూరిమి విరసంబైనను 
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !

అర్థాలు : కూరిమి = స్నేహం ; నేరము = తప్పు ; విరసము = విరోధము ; నిక్కము = సత్యము 

భావము : మనం ఎవరితోనైనా స్నేహంగా ఉన్నపుడు వారు తప్పుచేసినా మనం పట్టించుకోము. వారి తప్పులు కనిపించవు . కానీ వారికీ మనకు విరోధము ఏర్పడితే వారు ఏది చేసినా మనకు అన్నీ తప్పులుగానే కనిపిస్తాయని భావం. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు