Pages

Showing posts with label Telugu Padyalu. Show all posts
Showing posts with label Telugu Padyalu. Show all posts

తనువున విరిగిన యలుగుల - పద్యం

                                                        తనువున విరిగిన యలుగుల - పద్యం  

తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను  మెన్ని యుపాయములను వెడలునె  యధిపా!

భావం:-శరీరంలోకి  దిగిన బాణాలను అతి  కష్టంమీద బయటకు తీయవచ్చు. బాణం  చేసిన గాయాలను
           మాన్పవచ్చు .  కాని ఇతరులకు కష్టాన్ని కలిగించేట్లు మాట్లాడిన  మాటలను  తొలిగించడం ఎన్ని
           ఉపాయాలచేతకూడా సాధ్యం కాదు. 

Telugu Padyam - సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా. 
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ 
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ. 

Telugu Padyalu - ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు

ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు