Pages

Showing posts with label padyam. Show all posts
Showing posts with label padyam. Show all posts

తెలుగు పద్యం - సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ

తెలుగు పద్యం - సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ
సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ
మభినవోత్సల కోమలంబగుచు వెలయు
నాపదలు వొందునపుడు మహా మహీధ
రాశ్మ సంఘాతకర్కశంబై తనర్చు.

భావము : సంపదలు కలిగినప్పుడు మహాత్ముల మనస్సులు కలువల వలె మృదువుగా ఉంటాయి.
               ఆపదలు వచ్చినప్పుడు మాత్రం పెద్ద కొండకాళ్ల వలె కఠినముగా ఉంటాయి. అంటే
              సంపదలు వచ్చినప్పుడు గర్వించి కఠినముగా ప్రవర్తించరనీ, ఆపదలు వచ్చినప్పుడు
             వెలవెలబోరనీ భావం. 

ఆయతపక్షతుండహతి - పద్యం

ఆయతపక్షతుండహతి - పద్యం 
ఆయతపక్షతుండహతి  నక్కులశైలము  లెల్ల  నుగ్గుగా 
జేయు మహాబలంబును  బ్రసిద్ధియునుం  గల  నాకు  నీపనిం  
బాయక వీపునం దవడుబాముల  మోవను, వారికిం  బనుల్ 
సేయను నేమి  కారణము సెప్పుము దీని బయోరుహాననా!

తాత్పర్యం :- పద్మంవంటి ముఖం గల తల్లీ! విశాలమైన రెక్కలతో, వాడి అయిన  ముక్కుతో  
                   కులపర్వతాలన్నిటినీ పిండిగా  చేయగల  గోప్పబలం , కీర్తి  గల నేను, 
                   నీచమైన  పాములను  ఎల్లకాలం  వీపు  మీద  మోయడానికి, వాటికి 
                    సేవలు చేయడానికి గల కారణమేమిటో చెప్పు. 

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు