Pages

Showing posts with label vemana padyalu. Show all posts
Showing posts with label vemana padyalu. Show all posts

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 4

     వేమన పద్యరత్నాకరము -  ఉసురులేని తిత్తి యినుమంత వూదిన 

ఉసురులేని తిత్తి యినుమంత వూదిన 
వంచ లోహములును భస్మమౌను 
పెద్ద లుసురు మంటె పెనుమంట లెగయవా 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  ఇనుప కొలిమిని ఊదే తిత్తికి ఉసురులేదు. అది కొద్దిపాటి ఊదినా పంచలోహాలూ బూడిదైపోతాయి. పెద్దవారిని ఉసురు పెడితే కానరాని మంటలు తిత్తి ఊదగా కొలిమి నుండి బయలు వెడలిన పెనమంటలకంటే 
ఎన్నో రెట్లు మహాజ్వాలలు రేగును.

 వేమన పద్యరత్నాకరము -  మందు దిన బోటు మానును 

మందు దిన బోటు మానును 
మందు దినగజేయ పొలతి మహిలో వలచున్ 
మందు దిన కుదురు రోగము
మందు దినంగలదు పుష్టి మహిలో వేమ ! 

అర్థం:  మందు వాడితే బాధ తగ్గును. వలపు పెరగడానికి కాంతకు మందురాస్తే   ప్రేమిస్తుంది. ఇంకా ఔషధ సేవ వల్ల జబ్బు నయం అవుతుంది. మందు పుచ్చుకు ఒంటికి కావలసిన పుష్టి చేకూరుతుంది.

వేమన పద్యరత్నాకరము -  తలను పాగ పైని తగు పచ్చడము బొజ్జ 

తలను పాగ పైని తగు పచ్చడము బొజ్జ 
చెవుల పోగు లరసి జేరునర్థి; 
శుద్ధ పశువు లౌట బుద్ధిలో నెరుగక 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:   వేషభాషలు చూచి యాచకుడు వెంటపడతాడు. వాడు పశువు అని ఆలస్యంగా తెలుసుకుంటాడు పాపము.

వేమన పద్యరత్నాకరము -  స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ 

స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ 
సేయని మనుజుండు చెడు నిజంబు; 
యేటి గట్టు మానుకెప్పుడు చలనంబు? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  మనసు నిలుపలేనివాడు పతనమౌతాడు. స్త్రీ సుఖం కోసం ప్రాకులాడే మనిషి ఏటిగట్టుదారి నున్నచెట్టులా చలనం పొందుతాడు. 

వేమన పద్యరత్నాకరము -  కూలి నాలి జేసి గుల్లాపు పనిజేసి, 

కూలి నాలి జేసి గుల్లాపు పనిజేసి, 
తెచ్చి పెట్ట యాలు మెచ్చ నేర్చు; 
లేమి జిక్క విభుని వేమారు దిట్టును 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: కూలినాలి చేసి ఏదో విధంగా నాలుగు డబ్బులు సంపాదిస్తుంటే భార్య ఎంతగానో మెచ్చుకుంటుంది. పేద తనంతో బాధపడే సమయంలో ఆ భార్యే భర్తని సూటిపోటి మాటలతో వెయ్యి విధాలుగా దూషిస్తుంది.

వేమన పద్యరత్నాకరము -  ఇంద్రియ పరవశుడధముం 

ఇంద్రియ పరవశుడధముం 
డింద్రియ పరవశుడు భక్తియెడ మధ్యముడౌ; 
నింద్రియ జయు డుత్తముడు జి 
తేంద్రియ సమ్మదుడు విన మహేశుడు వేమా !

అర్థం: కేవల ఇంద్రియ సుఖాలనే కోరినవాడు అధముడు భక్తి భావనవల్ల ఇంద్రియ పరవశుడయితే అట్టి మధ్యముడు ఇంద్రియ సుఖాలనుండి విరక్తి పొందినవాడు ఉత్తముడు జితేంద్రియుడు సర్వదా శ్లాఘనీయుడవుచు, అట్టివాడు యోగులలో పరమయోగి అగువాడు మహేశ్వరుడు.

వేమన పద్యరత్నాకరము -  తన గుణము తనకు నుండగ

తన గుణము తనకు నుండగ
నెనయంగా నొరుని గుణము నెరిచును మదిలో 
తన గుణము తాను దెలియక; 
బరు నిందంజేయువాడు భ్రష్టుడు వేమా!

అర్థం: తనలో తప్పు తెలుసుకోలేక విశేషంగా ఇతరుల తప్పు ఎన్నుతుంటాడు. తనలో గల లోపాలు గ్రహించుకోకుండా పరులను నిందించువాడు భ్రష్టుడు.

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 3

    వేమన పద్యరత్నాకరము -  నక్క వినయములను నైగారములు బల్కి 

నక్క వినయములను నైగారములు బల్కి 
కుడవకెల్ల ధనము కూడబెట్టు 
కుక్కబోను వాత కూడు చల్లిన రీతి 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: నక్క వినయాలను నటిస్తూ ఇచ్చకాలు పలుకుతూ డబ్బుని అనుభవించక అదేపనిగా కూడబెడుతుంటాడు. అది ఎలాంటిదంటే కుక్కబోను ముందు కూటిని జల్లడం లాంటిది.

 వేమన పద్యరత్నాకరము -  వెళ్ళివచ్చునాడు మళ్ళిపొయ్యేనాడు 

వెళ్ళివచ్చునాడు మళ్ళిపొయ్యేనాడు 
వెంటరాదు ధనము కొంచ బోడు 
తాను యేడబోవు? ధనమేడబోవునో? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  ఎవడూ ధనాన్ని తెచ్చుకుని లోకంలోకి రావడం లేదు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు పట్టుకొని పోలేడు. మరణించిన తరువాత ధనం దారి ధనముది. తన దారి తనది.

వేమన పద్యరత్నాకరము -  పుట్టుబిత్తలివలె పోవు బిత్తలివలె 

పుట్టుబిత్తలివలె పోవు బిత్తలివలె 
తిరుగు బిత్తలివలె దేహి ధరణి 
యున్నవాటికైన నుపకారి గాలేడు 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: జనుడు దిగంబరంగా పుడుతున్నాడు. అట్లే మరణిస్తున్నాడు. వ్యామోహాదులన్నింటినీ విడిచి వాడు ఓ మునిగా దిగంబరుడై భూమ్మీద సంచరిస్తున్నాడు.

వేమన పద్యరత్నాకరము -  కాశి బోదు ననుచు కడ కట్టగానేల? 

కాశి బోదు ననుచు కడ కట్టగానేల? 
వాశి తీర్థములను వగవనేల? 
దోసకారికెట్లు దొరకురా యా కాశి? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: కాశీకి వెడుతున్నానంటూ వట్టి డంబాలు కొడతారు కొందరు. చివరకా పుణ్య తీర్థాలను దర్శించలేక విచారిస్తూంటారు. దుష్ట బుద్దులకు కాశీ సులభంగా లభించదు. పుణ్య ఉంటేనే కాశీ వెళ్ళగలరు.

వేమన పద్యరత్నాకరము -  ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు  

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు 
కాచి యతక నేర్చు కమ్మరీడు 
మనసు విరిగెనేని మరి యంట నేర్చునా? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: ఇనుపముక్క విరిగితే దాన్ని తీవ్రంగా కాల్చి రెండుసార్లయినా మూడు సార్లయినా అతకవచ్చు. మనస్సు విరిగితే మాత్రం అతకడం చాలా కష్టం.

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 2

   వేమన పద్యరత్నాకరము -  లోభివాని జంప లోకంబులోపల    

లోభివాని జంప లోకంబులోపల 
మందు పలదు వేరు మతము గలదు 
పైక మడిగినంత చాల భగ్గున పడిచచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: లోభిని చంపడానికి లోకంలో మందేదీ వేరే అక్కర్లేదు. డబ్బడిగితే చాలు లోభి మండి పడి చస్తాడు.

 వేమన పద్యరత్నాకరము -  మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగయౌ

మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగయౌ 
నేటి ప్రాణమింక? నేటి బ్రతుకు? 
మాట సత్యమైన మరి శతాయుస్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  మాటలాడితే అన్నీ అబద్దాలే. మనసయితే దొంగ బుద్దే. అటువంటివాడు ఒక్క సత్యమైన పలుకు పలికితే అదే నూరేళ్ళు నిలుస్తుంది.

వేమన పద్యరత్నాకరము -  కలిమినాడు నరుడు కానడు మదమున  

కలిమినాడు నరుడు కానడు మదమున 
లేమినాడు మొదలె లేదు పెట్ట 
కలిమి లేమి లేని కాలంబు గలుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: సంపద కలిగిన రోజుల్లో మదంతో సంచరిస్తాడు. ఆ రోజుల్లో ఎవరికైనా కాస్తంత పెట్టడం అనేదే ఉండదు. లేమిలోన యేమీ చేయలేడు యిక కలిమి లేములు లేని కాలం అంటూ ఉంటుందా?

వేమన పద్యరత్నాకరము -  కనియు గానలేడు కదిలింపదానోరు 

కనియు గానలేడు కదిలింపదానోరు 
వినియు వినగలేడు విస్మయమున 
సంపద గలవాని సన్నిపాతక మిది 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: సమాజంలో భాగ్యవంతుని దశను వేమన చమత్కారంగా యిలా చెప్తున్నాడు. 
               భాగ్యవంతుడు ఏదైనా సన్నివేశాన్ని చూసి కూడా నోరు మెదపకుండా చూడనట్లే ఉంటాడు. యేదైనా విన్నా కూడా విననట్లే ఉంటాడు. ఇది భాగ్యవంతుని కుండే సన్నిపాత రోగం.

వేమన పద్యరత్నాకరము -  తీర్ప నార్పలేని తీర్పరితన మేల? 

తీర్ప నార్పలేని తీర్పరితన మేల? 
కూర్ప విప్పలేని నేర్పరేల? 
పెట్టి పొయ్యలేని వట్టి బీరములేల?
విశ్వదాభిరామ వినుర వేమ! 

అర్థం: ఒక సమస్యను తీర్చడానికి ఆర్చడానికి గాని సమర్దుడై ఉండాలి. తీర్పరంటే అట్టివాడు. ఒక చిక్కు వచ్చినప్పుడు దాన్ని విప్పడానికి కౌశల్యం ఉన్నవాడే నేర్పరి. పెట్టలేక పొయ్యలేక చెప్పే అసమర్దుని మాటలే కోతలు.

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు

  వేమన పద్యరత్నాకరము -  నీటిలోన మొసలి నిగిడి యేనుగుబట్టు   

నీటిలోన మొసలి నిగిడి యేనుగుబట్టు 
బైట కుక్కచేత భంగపడును 
స్థాన బలిమిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: నీటిలో ఉన్న మొసలి యేనుగును కూడా లోపలికి యీడ్చుకు  పోగలుగుతుంది. అదే మొసలి నేల మీద ఉంటే కుక్కకి కూడా భయపడిపోతుంది. ఆలోచించి చూడగా అదంతా స్థానబలం అని తెలుస్తుంది.

 వేమన పద్యరత్నాకరము -  కులములో నొకండు గుణవంతు డుండిన   

కులములో నొకండు గుణవంతు డుండిన 
కులము వెలయు వానిగుణముచేత; 
వెలయ వనములోన మలయజంబునట్లు 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  వంశంలో గుణవంతుడెవడైనా ఉన్నాడా! ఆ వంశము అంతా కీర్తి  కెక్కుతుంది. అదెలాగంటే వనంలో ఒక గంధ వృక్షం ఉంటే ఆ వనం అంతా గంధపూరితమై కీర్తికెక్కుతుంది.

వేమన పద్యరత్నాకరము -  పంది పిల్లలీను పదియు నైదింటిని  

పంది పిల్లలీను పదియు నైదింటిని
కుంజరంబు యీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు జాలడా 
విశ్వదాభిరామ వినుర వేమ!4

అర్థం: పంది పదిహేను పిల్లన్ని కంటుంది. కాని యేనుగు ఒక్కపిల్లనే కంటుంది. అది చాలదా. ఎంతో మంది పనికిమాలిన వారిని కనడం కంటే మంచివాణ్ణి ఒక్కణ్ణి కంటే చాలు..,అని భావం. 

వేమన పద్యరత్నాకరము -  ఎరుగువాని దెలుప నెవ్వడైనను జాలు

ఎరుగువాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరితరమయా
విశ్వదాభిరామ వినుర వేమ !

అర్థం: బుద్ధిమంతునికి బోధించడం చాలా సుళువు. ఏటికి ఒంకర తీర్చడం లాగే మందబుద్ధికి తెలపడం మహాకష్టం.

వేమన పద్యరత్నాకరము -  అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బలుకు చల్లగాను 
కంచుమ్రోగునట్లు కనకంబు మోగునా ? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: అల్పుడు మితిమీరిన ఆడంబరంతో మాట్లాడుతాడు. సత్పురుషుడు చల్లగా మాట్లాడుతాడు. ఎలాగంటే కంచు మ్రోగునట్లు బంగారం మ్రోగదు కదా... అని భావం. 

వేమన పద్యరత్నాకరము - ముక్కుతాళ్లగ్రుచ్చి మురికిపోవగం దోమి

 వేమన పద్యరత్నాకరము -  ముక్కుతాళ్లగ్రుచ్చి మురికిపోవగం దోమి  

ముక్కుతాళ్లగ్రుచ్చి మురికిపోవగం దోమి 
కచ్చనీరునించి కడిగి కడిగి
డొక్కతోమినంత దొరకునా మోక్షంబు? 
విశ్వదాభిరామ వినురవేమ!

 తాత్పర్యము : మూర్ఖులైన యోగులు కొందరు ముక్కులో గుడ్డలు క్రుక్కి మురికి తీసి, కట్టుగుడ్డలను నీటిలో బాగుగా ఉతికి, శరీరమును బాగుగా తోమి స్నానము చేయుదురు. దీనివల్లనే ముక్తి కలుగునని భ్రాంతి పొందెదరు.

వేమన పద్యరత్నాకరము - మాటలాడఁగల్గు మర్మము లెఱిఁగిన

 వేమన పద్యరత్నాకరము -  మాటలాడఁగల్గు మర్మము లెఱిఁగిన 

మాటలాడఁగల్గు మర్మము లెఱిఁగిన 
పిన్న పెద్దతనము లెన్నవలదు 
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుగదా? 
విశ్వదాభిరామ వినురవేమ!

 తాత్పర్యము : మాటలాడు నేర్పుగలవాడు పిన్నవాడైనను, పెద్దవాడైనను సమానమే. భేదము లేదు. చిన్నవాని చేతిలో ఉన్నను దీపము బాగుగా ప్రకాశించును కదా!

వేమన పద్యరత్నాకరము - మంత్రమెల్ల మఱచి మధురాధరముఁ గోరి

 వేమన పద్యరత్నాకరము - మంత్రమెల్ల మఱచి మధురాధరముఁ గోరి

మంత్రమెల్ల మఱచి మధురాధరముఁ గోరి
ఎట్లు మొఱకుఁ డొడయు నెఱుఁగఁగలఁడు?
ఉవిదఁజూచి పరమయోగంబు మఱచును, 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము : మూర్ఖుడు మంత్రము జపించుచు, స్త్రీ కనబడినచో ఆమెతో సుఖింపగోరును; గొప్పదైన యోగమును, మంత్రమును మరచును. ఆతడు దేవుని ఎరుగలేడు కదా! 

వేమన పద్యరత్నాకరము - మంచివారు లేరు మహిమీద వెదకిన

 వేమన పద్యరత్నాకరము - మంచివారు లేరు మహిమీద వెదకిన

మంచివారు లేరు మహిమీద వెదకిన
కష్టులెందరైనఁగలరు భువిని 
పసిడి లేదుగాని పదడెంత లేదయా! 
విశ్వదాభిరామ వినురవేమ!

 తాత్పర్యము : లోకములో మంచివారు దొరకుట కష్టము. చెడ్డవారెందరైనను దొరకుదురు. మనకు బంగారము దొరకుట కష్టము. బూడిద సమృద్ధిగా దొరకును.

వేమన పద్యరత్నాకరము - మఘవుండైననేమి? మర్యాదయెఱుఁగని

 వేమన పద్యరత్నాకరము - మఘవుండైననేమి? మర్యాదయెఱుఁగని 

మఘవుండైననేమి? మర్యాదయెఱుఁగని 
వారలేల తెలిసి గౌరవింత్రు 
ఉరిమి మొఱుగుకుక్క యోగినే మెఱుఁగురా? 
విశ్వదాభిరామ వినురవేమ!

 తాత్పర్యము : మర్యాద తెలియనివారు దేవేంద్రుడు వచ్చినను ఆతనిని గౌరవింపరు. కుక్క మొరుగుచు యోగిని వెంబడించును. ఆయన గొప్ప తనము దానికెట్లు తెలియును? 

వేమన పద్యరత్నాకరము - బండబూతులాడు పరమనీచుండెన్న

 వేమన పద్యరత్నాకరము - బండబూతులాడు పరమనీచుండెన్న

బండబూతులాడు పరమనీచుండెన్న 
దండివాని మేల్మి తానెఱుఁగునె?
చందనంబు ఘనత పంది యేమెఱుఁగును? 
విశ్వదాభిరామ వినురవేమ!

 తాత్పర్యము : బూతులాడునట్టి నీచునకు మంచివారి గొప్పతనమెట్లు  తెలియును? మంచి గంధము యొక్క గొప్పతనము పందికెట్లు తెలియ గలదు? 

వేమన పద్యరత్నాకరము - పొట్లకాయ రాయి పొదుగఁ ద్రాఁటనుగట్ట

 వేమన పద్యరత్నాకరము -  పొట్లకాయ రాయి పొదుగఁ ద్రాఁటనుగట్ట

పొట్లకాయ రాయి పొదుగఁ ద్రాఁటనుగట్ట
లీలతోడ వంకలేక పెరుగు
కుక్కతోఁకఁగట్టఁ గుదురునా చక్కఁగా? 
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : పొట్లకాయ వంకరలు లేక తిన్నగా పెరుగుటకు త్రాటితో రాయి కట్టుదురు. కుక్కతోకను అట్లు కట్టినను అది తిన్నగా ఉండదు. మూర్ఖుడును అట్లే బాగుపడడు.

వేమన పద్యరత్నాకరము - పుట్టుఫలములేని పురుషాధములు భువిఁ

 వేమన పద్యరత్నాకరము -  పుట్టుఫలములేని పురుషాధములు భువిఁ

పుట్టుఫలములేని పురుషాధములు భువిఁ
బుట్టనేమి? లేక గిట్టనేమి? 
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా? 
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : తాను పుట్టిన ప్రయోజనమేమో ఆలోచించి తగిన రీతిని ప్రవర్తింపవలెను. అట్లే లేనివాడు అథముడు. వాడున్నను లేకున్నను ఒకటే! పుట్టలో చెదలు పుట్టలేదా? వానివలన ప్రయోజన మేమున్నది?

వేమన పద్యరత్నాకరము - పాముకన్నలేదు పాపిష్టియగు జీవి

 వేమన పద్యరత్నాకరము -  పాముకన్నలేదు పాపిష్టియగు జీవి 

పాముకన్నలేదు పాపిష్టియగు జీవి 
యట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుఁజెప్ప నెవ్వరి తరమయా? 
విశ్వదాభిరామ వినురవేమా!
 తాత్పర్యము : పాముకంటె దుష్టమైన ప్రాణి లేదుకదా! అట్టి పాముకూడ పాములవాడు చెప్పినట్లు వినును.మూర్ఖుడో! ఎవ్వరు చెప్పినను వినడు! 

వేమన పద్యరత్నాకరము - పర్వతవనవాసి పరిణామవర్తన

 వేమన పద్యరత్నాకరము -  పర్వతవనవాసి పరిణామవర్తన 

పర్వతవనవాసి పరిణామవర్తన 
 కూపవాసి కెట్లు గుఱుతు పడును?
బ్రహ్మదేవువెంటఁ బ్రాకృతుఁ డరుగునా? 
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : అడవులలోను, కొండలలోను వైరాగ్యముతో ఉన్నవాని ప్రవర్తన మూర్ఖున కెట్లు తెలియును? బ్రహ్మదేవుడే ముందు వెళ్ళుచున్నను పామరు డాతనివెంట పోడు.

వేమన పద్యరత్నాకరము - పరఁగఁ దానొసఁగఁడు పరులు చెప్పిననైన

 వేమన పద్యరత్నాకరము -  పరఁగఁ దానొసఁగఁడు పరులు చెప్పిననైన

పరఁగఁ దానొసఁగఁడు పరులు చెప్పిననైన
నియ్యఁ జాలక విధినెసగువాడు
పొట్టు తినెడి లోభి బువ్వను పెట్టునా? 
విశ్వదాభిరామ వినురవేమా!
 తాత్పర్యము : మూర్ఖుడు తన యజమానుడు ఈయవలెనని చెప్పినను, తన కక్కరలేని వస్తువునైన ఇతరుల కీయడు. తానే పొట్టు తిను లోభి, ఇతరులకు అన్నము పెట్టడు గదా! 



వేమన పద్యరత్నాకరము నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి

 వేమన పద్యరత్నాకరము నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి 

నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి 
కూడు పెట్టి మీద గోకకట్టి
యెన్నిపాట్లో పడుదు రీదేహమునకయి, 
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : ఈ దేహము నశించునదే అని తెలియక జనులు నీళ్ళు పోసి, తోమి, గుడ్డలు కట్టి, తిండి పెట్టి, దీనికయి నానా కష్టములు పడుచుందురు. వీరి మూర్ఖత నేమందును? 



వేమన పద్యరత్నాకరము నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు

 వేమన పద్యరత్నాకరము నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు

నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు, 
విశ్వదాభిరామ వినురవేమా!
 తాత్పర్యము : మూర్ఖుడు ఇది మంచి, ఇది చెడ్డ అని ఆలోచింపక మాటి మాటికిని మాటలను మార్చుచునే యుండును. నీటిలో వ్రాసిన వ్రాతవలె ఆ మాట నిరుపయోగమైనది. 



వేమన పద్యరత్నాకరము - తనలో సర్వంబుండఁగ

 వేమన పద్యరత్నాకరము - తనలో సర్వంబుండఁగ

తనలో సర్వంబుండఁగ
తనలోపల వెదుకలేక ధరవెదకెడి యీ 
తనువుల మోసెడి యెద్దుల
మనములఁదెల్పంగ వశమె మహిలో వేమా! 
తాత్పర్యము : తమ లోపలనే భగవంతుడుండగా తెలిసికొనలేక అతని కొరకు పైచోట్ల వెదకువారు మూర్ఖులు, బుద్ధిహీనులు. వారికి నచ్చజెప్పుట కెవ్వరికిని సాధ్యము కాదు.



వేమన పద్యరత్నాకరము - తనదు బాగుఁగోరి ధర్మంబు చెప్పిన

 వేమన పద్యరత్నాకరము - తనదు బాగుఁగోరి ధర్మంబు చెప్పిన

తనదు బాగుఁగోరి ధర్మంబు చెప్పిన 
దిట్టుచుండ్రు  మొఱకు లెట్టయెదుట 
గడ్డివేయ పోట్ల గొడ్డు కొమ్మాడించు, 
విశ్వదాభిరామ వినురవేమా!
 తాత్పర్యము : తన బాగు కోరి మంచి చెప్పినవారిని మూర్ఖులు ముఖము ముందే తిట్టుదురు. దయతలచి తినుటకు గడ్డి వేయగా పోట్ల గొడ్డు పొడుచుటకు కొమ్ముల నాడించును. 

 

వేమన పద్యరత్నాకరము - తగదు తగదటంచు తగువారు చెప్పిన

 వేమన పద్యరత్నాకరము - తగదు తగదటంచు తగువారు చెప్పిన

తగదు తగదటంచు తగువారు చెప్పిన
వినఁడు మొఱకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మీరనింతెకా, 
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : 'ఇది తగ'దని తగినవారెంత చెప్పినను మూర్ఖుడు వినడు. వాడు మునులు చెప్పిన ధర్మములను అతిక్రమించి నడుచుచు చెడిపోవును. 



 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు