శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ!
భావము : మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని యొక్క దయ వలన నిశ్చయముగా అందరు జనులును సెబాసనునట్లుగా నోటి నుండి నీళ్లూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.
No comments:
Post a Comment