శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ! ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సరినాయక అమరదాల్తువు ! శ్రీహరి కృష్ణా!
తాత్పర్యం : నీవు తలమీద రత్నములు చెక్కిన కిరీటమును కరములందు శంఖము, చక్రము, అనేక గొప్ప అలంకారములను, వక్షఃస్థలమున కౌస్తుభ రత్నముతో కూడిన పతకములను బహు అలంకారముగా నుండునట్లు ధరింతువు.
No comments:
Post a Comment