ఆయతపక్షతుండహతి - పద్యం
ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగా
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీపునం దవడుబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీని బయోరుహాననా!
తాత్పర్యం :- పద్మంవంటి ముఖం గల తల్లీ! విశాలమైన రెక్కలతో, వాడి అయిన ముక్కుతో
కులపర్వతాలన్నిటినీ పిండిగా చేయగల గోప్పబలం , కీర్తి గల నేను,
నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి, వాటికి
సేవలు చేయడానికి గల కారణమేమిటో చెప్పు.
No comments:
Post a Comment