సుద్దముక్క(chalk) తో నల్లబల్ల(blackboard)పై రాస్తుంటే 'కీచు కీచు' మనే శబ్దం వస్తుంది. ఎందుకు?
జవాబు: నల్లబల్లపై (blackboard) రాసేటప్పుడు సుద్దముక్క (chalk) ను గట్టిగా అదిమి పట్టుకుంటాము. అప్పుడది blackboard ఉపరితలానికి సమాంతరముగా అడ్డంగా కదులుతూ ఉంటుంది. నల్లబల్లకు, సుద్దముక్కకు మధ్య ఏర్పడిన ఘర్షణ వల్ల సుద్దముక్క నుంచి వెలువడిన పొడి blackboard ను అంటుకుంటాయి. రాసే సమయంలో ఘర్షణ తక్కువగా ఉంటే సుద్దముక్క జారుతూ వెంటవెంటనే బోర్డు పై అనేక చోట్ల అనేక సార్లు తాకుతుంది. అందువల్లనే మనకు 'కీచు కీచు' మనే శబ్దం వినిపిస్తుంది. ఈ ఘర్షణ బలం ముఖ్యముగా సుద్దముక్క, నల్లబల్లతో చేసే ఏటవాలు కోణం మీద, అది నల్లబల్లను తాకే వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఘర్షణ బలం తగ్గినప్పుడల్లా శబ్దాలు వస్తాయి.
No comments:
Post a Comment