Pages

భాస్కర శతక పద్యాలు - ఆదర మింతలేక

భాస్కర శతక పద్యాలు - ఆదర మింతలేక 

                                ఆదర మింతలేక నరుడాత్మ బలోన్నతి మంచివారికిన్ 
                                భేదము చేయుటం దనదు పేర్మికి గీ డగు మూల మెట్లమ 
                                ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాడ్యుడైన ప్ర 
                                హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందడె మున్ను భాస్కరా 

తాత్పర్యము : పూర్వము దుష్టవర్తియైన హిరణ్యకశిపుడను రాక్షసుడు అతని కుమారుడైన ప్రహ్లాదుని సద్గుణములను సహింపలేక యాతని బాధించి తాను చివరకు నాశనమయ్యెను. అట్లే మనుష్యుడెంత గొప్పవాడైనప్పటికీ సజ్జనులను నిర్దయుడై బాధించినచో నశించును. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు