Pages

Showing posts with label ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్లు నుదికిన. Show all posts
Showing posts with label ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్లు నుదికిన. Show all posts

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్లు నుదికిన - మూర్ఖ పద్ధతి

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్లు నుదికిన
నలుపునలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ ! వినురవేమ!

తాత్పర్యం: ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినను దాని నలుపు పోయి తెలుపు రాదు. కొయ్యబొమ్మను ఎంత కొట్టినను అది పలుకదు. అట్లే మూర్ఖున కెంత చెప్పినను బోధపడదు.
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు