Pages

Showing posts with label మూర్ఖ పద్ధతి. Show all posts
Showing posts with label మూర్ఖ పద్ధతి. Show all posts

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్లు నుదికిన - మూర్ఖ పద్ధతి

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్లు నుదికిన
నలుపునలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ ! వినురవేమ!

తాత్పర్యం: ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినను దాని నలుపు పోయి తెలుపు రాదు. కొయ్యబొమ్మను ఎంత కొట్టినను అది పలుకదు. అట్లే మూర్ఖున కెంత చెప్పినను బోధపడదు.

ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను - మూర్ఖ పద్దతి

ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు,
విశ్వదాభిరామ ! వినుర వేమ !

తాత్పర్యం : ఎంత చదివినను, ఎన్ని మంచి మాటలు విన్నను నీచుడు తన చెడ్డ గుణమును విడువడు.నల్లని బొగ్గును పాలతో కడిగినను ఆ నలుపు పోదు కదా!

ఎక్కువయును తక్కువెట్టివి? వారికి - పద్యం

ఎక్కువయును తక్కువెట్టివి? వారికి
తనువు సతముకాదు తథ్యమరయ,
నెరింగి తిరుగలేరి కేమన మూర్ఖులు,
విశ్వదాభిరామ ! వినురవేమ !

తాత్పర్యం : భగవంతుని సృష్టిలో ఎక్కువ తక్కువ భేదములు లేవు. ఈ శరీరములు నిత్యము కావు. మూర్ఖులు ఈ సంగతిని తెలిసికొనలేకున్నారు.
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు