Pages

Showing posts with label Kumara satakam. Show all posts
Showing posts with label Kumara satakam. Show all posts

Kumara Shataka Poems - Sari Vaari lona

కుమార శతకము - సరి వారి లోన నేర్పున 
సరి వారి లోన నేర్పున 
దిరిగెడి వారలకు గాక తెరవాటులలో 
నరయుచు మెలిగెడి వారికి 
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా!

తాత్పర్యము : ఓ కుమారా! నీతో మెలిగేవారు మంచివారయితే సమాజంలో నీకు మంచి గౌరవం ఉంటుంది. దుష్టబుద్ధి గలవారితో తిరిగితే నీకు కూడా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి మంచివారితోనే స్నేహం చెయ్యాలి. 

Kumara Satakamu - వగువకు గడిచిన దానికి

కుమార శతకము - వగువకు గడిచిన దానికి 
వగువకు గడిచిన దానికి 
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై 
యెగి దీనత నొందకుమీ 
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!

భావము  : ఓ కుమారుడా! అయిపోయిన పనిని గురించి చింతింప వద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. 
                 నీకు సాధ్యం కాని దానిని పొందలేకపోతినని చింతించుట  పనికి రాదు. భగవంతుడు 
                 యిచ్చిన దానితో తృప్తి చెందుము. 

Kuymara Satakamu - ఆచార్యున కెదిరింపకు

కుమార శతకము - ఆచార్యున కెదిరింపకు 
ఆచార్యున కెదిరింపకు 
బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా 
లోచనము లొంటి జేయకు 
మాచారము విడువ బోకుమయ్య కుమారా!

భావము : ఉపాధ్యాయుని ఎదిరింపవలదు. నిన్ను గాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా 
               ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. మంచి నడవడిని వదిలిపెట్టవద్దు. 

Kumara Satakamu - అతి బాల్యములోనైనను

కుమార శతకము - అతి బాల్యములోనైనను 
అతి బాల్యములోనైనను 
బ్రతికూలపు మార్గముల బ్రవర్తింపక స
ద్గతిమీర మెలగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్య మగును కుమారా !

భావము : ఎప్పుడు లోకమునందు చిన్నవాడుగనుండినప్పటికిని, విరుద్ధముగ
               నడువక మంచిమార్గమున నడచుచుండునో, వాడు లోకమున సుఖముగా
               జీవింపగలడు. ఏ శ్రమలను పొందడు. 

Kumara Satakamu - శ్రీ భామినీ మనోహరు

కుమార శతకము - శ్రీ భామినీ మనోహరు 
శ్రీ భామినీ మనోహరు 
సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్
లో భావించెద; నీకున్
వైభవము లొసంగుచుండ వసుధ కుమారా !

భావము : శ్రీలక్ష్మీనాథుడను, సంపదయు, ప్రేమయు రూపముగా గలవాడును అగు
               శ్రీ మహావిష్ణువును, నీ కెల్లప్పుడును సకలైశ్వర్యములను ఇచ్చునట్లుగ
               నా మనస్సునందు తలంచుచున్నాను. 

Kumara satakam - సద్గోష్టి సరియు నొసగును

కుమార శతకము - సద్గోష్టి సరియు నొసగును 
సద్గోష్టి సరియు నొసగును 
సద్గోష్టియె కీర్తిన్ బెంచు సంతుష్టిని నా 
సద్గోష్టియె యొనగూర్చును 
సద్గోష్టియె పాపములను జంపు కుమారా !

భావము : ఓ కుమారా ! సజ్జనులతో సహవాసము, మాటలాడుట సంపదలను కలిగించును. 
                కీర్తిని వృద్ధికి తెచ్చును. తృప్తి కలిగించును. పాపములను బోగొట్టును. కాబట్టి 
               సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది. 

Telugu Kiranaalu - Kumara satakam

Kumara satakam - సరివారిలోన నేర్పున

కుమార శతకము - సరివారిలోన నేర్పున 
సరివారిలోన నేర్పున  
దిరిగెడు వారలకుగాక తెరవాటులలో 
నరయుచు మెలగెడి వారికి 
బరువేటికి గీడె యనుభవంబు కుమారా !

భావము : ఓ కుమారా ! తనతో సమానమైన వారితో నేర్పున నడచుకొనిన గౌరవము , కీర్తి లభించును. 
               అంతేకాక దుష్టులతోను, దొంగలతోనూ స్నేహము చేసిన యెడల గౌరవము చెడి కీడు 
               జరుగును. 

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు