Pages

Telugu kiranaalu - సుభాషితాలు

బాధ్యతల నుంచి తప్పుకోవటం వల్ల ఆధ్యాత్మిక చింతన పొందలేం.
నేనే నిశ్శబ్దానికి ప్రతీకను అని మనస్సును అభినందించగలగడమే ధ్యానం
ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇవ్వడమే ధర్మం
ధ్యానమంటే ఓ పనిమీద లగ్నం గావించటం
మనకు జన్మనిచ్చిన భగవంతుని చేతుల్లోనే మన కర్మఫలం ఉంటుంది.
మనకు జన్మనిచ్చిన భగవంతుని చేతుల్లోనే మన కర్మఫలం ఉంటుంది.
జ్ఞానంయొక్క స్వయంసాధనే ధ్యానం
ప్రేమ ఉన్నచోట జీవితముంటుంది. పగ ఉన్నచోట నాశనం ఉంటుంది.
ధ్యానాన్ని ఒక పనిగా చేయకు; ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి
నీకు ఇతరులు ఏది చేయాలని కోరుకుంటావో, అదే నువ్వు ఇతరులకు చేయడం ధర్మం
ధైర్యమే వ్యక్తి స్వభావానికి చిహ్నం
ఉత్తమధర్మాన్ని అంత్యజుని నుండైనా ప్రయత్నించి గ్రహించాలి
ధార్మికులకు ఆత్మరక్షణకన్నా ధర్మరక్షణే ముఖ్యం
తనకు తానేది కోరునో ఇతరులకు కూడా అదే కోరుకోవాలి
తన విధిని తాను నిర్వహిస్తూ ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకపోవడమే ధర్మం
ధర్మాన్ని అనుసరించకుండుట దాన్ని ద్వేషించుట మానవుని పతనానికి కారణాలు
జ్ఞానంయొక్క స్వయంసాధనే ధ్యానం
సత్యమున్నచోటే ధర్మముంటుంది
చెడు అలవాట్లు క్రమంగా తగ్గించుకుంటే.. కొంతకాలానికి ఎంత చెడ్డవాడైనా సరే, మంచివాడిగా మారిపోతాడు.
సత్యమార్గంలో నడిచేవాడే నిజమైన సంపన్నుడు!
కష్టాలను చూసి పారిపోయేవాడు ..... జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు!
మండిన కొవ్వొత్తిలాగే ...... గడిచిన కాలం కూడా తిరిగిరాదు!
ఆత్మవిశ్వాసమే..... మనిషికి అసలైన ఆభరణం!
బలహీనుడిని బలవంతుడు కొడితే ..... బలవంతుడిని భగవంతుడు కొడతాడు!
ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్య పుస్తకం!
మనిషి తన కలలను పండించుకోవాలంటే ...... ముందు కళ్లు తెరవాలి!
చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే ..... గమ్యం కాదు!
వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి ... తన సర్వస్వాన్నీ కోల్పోయినట్లే!
ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ..... ప్రయత్నించనిదే విజయమూ దక్కదు!
కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం ...... ఎంతో మధురంగా ఉంటుంది.
లక్ష్యం గొప్పదైనప్పుడు త్యాగం గొప్పదవుతుంది.
సలహా అనేది ఎవరికి అత్యవసరమో .... వారికే రుచించదు.
అదుపులేని ఆలోచనలు..... శత్రువు కన్నా ప్రమాదకరం!
తన ఆలోచననే మార్చుకోలేని మనిషి,  వాస్తవంలో ఏమీ మార్చలేడు, ఫలితంగా ఎప్పటికీ పురోగతి సాధించలేడు 
గొప్ప గొప్ప అవకాశాలేవీ ఏటేటా రావు 
మనుషుల్ని గాయపర్చడం ఎంత తప్పో .... మనసుల్ని గాయపర్చడమూ అంతే తప్పు!
మీరు కష్టపడనంత వరకు .... మీ కలలు సాధ్యం కావు! 
అందం అనేది ముఖంలో ఉండదు. సహాయం చేసే మనసులో ఉంటుంది!
అమాయకత్వం కూడా ఒక రకం  వెఱ్ఱితనమే!
కొమ్మలు నరికినా చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. కష్టాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలని స్పూర్తినిస్తుంది.
మంచి దారే అయినా మళ్ళీ  మళ్ళీ నడుస్తూ ఉంటేనే మంచిగా ఉంటుంది. లేకుంటే ముళ్ళకంప మొలుస్తుంది.
గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు... వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు!
 చావుబతుకులు ఎక్కడో లేవు.ధైర్యంలోనే బతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.
ఓడిపోయినప్పుడు ఎలా ఆలోచిస్తామనేదాన్ని బట్టే ఎంత త్వరగా గెలుస్తామనేది ఆధారపడి ఉంటుంది.
జ్ఞానం వంశపారంపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.
చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు. చేతగాకపోతే తేనెటీగ కూడా తిప్పలు పెడుతుంది.
 కొత్త లక్ష్యాన్నిగానీ కొత్త కలనుగానీ ఆహ్వానించడానికి వయసుమీరడమంటూ ఉండదు.
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
కోరుకున్నదాన్ని పొందగలగడం అదృష్టం, పొందగలిగినదాన్ని కోరుకోవడం ఆనందం.
పైవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువవారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
కలలు ఆకాశంలోని నక్షత్రాల్లాంటివి.వాటిని అందుకోవడం అసాధ్యమే కావచ్చు, కానీ వాటిని అనుసరించడం ద్వారా లక్ష్యానికి చేరువ కావచ్చు.
నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేదే కలగదు.
నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది.
వర్తమాన క్షణాల్లో దొరకని శాంతి ఎక్కడా దొరకదు.
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే!
ఓటమి గురించి భయపడటం మొదలు పెడితే... విజయానికి దూరమైనట్లే!
గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు .... ఆనందంగా జీవించడం!
మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా... అది గెలుపే అవుతుంది!
తల మోసే భారాన్ని ఇతరులతో పంచుకుంటే తగ్గుతుంది. కానీ, మెదడు మోసే అజ్ఞాన భారాన్ని ఎవరికీ వారే తగ్గించుకోవాలి.
'సాధ్యం కాదు' అనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో నువ్వు వేసే తొలి అడుగు!
పని చేసిన ప్రతిసారీ సత్ఫలితాలు రాకపోవచ్చు. కానీ, అసలు ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు!
కింద పడ్డానని ఆగిపోకు ..... తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే! విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు.
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా ఆంతే! 
అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ..... అతి చెడ్డ గుణాలు. వీటిని దగ్గరికి రానిస్తే .... జీవితంలో పైకి రావడం, సుఖపడటం జరుగదు.
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసేవాడు ఉన్నతుడైతే ...... దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడవుతాడు!
పవిత్రమైన ప్రేమలో భయం ఉండదు. స్వార్థం మచ్చుకైనా కనిపించదు. 'ప్రేమించబడాలి' అనే ధ్యాస లేకుండా ప్రేమించడమే పరమోన్నత ప్రేమాదర్శం.
నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా...... నువ్వు బాధలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న!
నాయకత్వమంటే అధికారం చెలాయించడం కాదు, ప్రభావితం చెయ్యడం.
ఒక్కోసారి, మౌనంగా ఉండిపోవడం అన్నిటికన్నా ఘాటైన విమర్శ అవుతుంది.
ఒక మంచి పని చేసి ఊరుకో. దాని బాగోగులు చర్చించవలసింది ఇతరులు నువ్వు కాదు.
ప్రతి వెలుగునూ వెన్నంటి నీడ ఉంటుంది. ప్రతి నీడకూ వెలుగంటూ ఒకటి ఉంటుంది.
పైచేయి సాధించడమే గొప్పతనం కాదు, ఒక్కోసారి ఈగ కూడా సింహాన్ని చికాకు పెట్టగలుగుతుంది.
ఒక్కో సారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నీ నిజమైన స్థాయి ఏమిటో నీకు తెలిసేలా చేస్తుంది.
చిన్న పనులను నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాలు సాధించలేరు.
నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా, దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ దగ్గరి నుంచే మొదలవుతుంది.
ఏ ఒక్కరూ ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యలేరు కానీ ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయం చెయ్యగలరు.
చరిత్ర, స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం.
గెలుపు ఓటములను నిర్ణయించడంలో ప్రధానపాత్ర సామర్థ్యానిది కాదు, స్వభావానిది.
మంచిమాట పర్యవేక్షణతో నిమిత్తం లేకుండా పనులు సజావుగా పూర్తికావడం ఉత్తమ నాయకత్వానికి నిదర్శనం.
రహస్యం... నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీ యజమాని.
ఏ పని చేయకుండా బద్దకించే వాడి కంటే ఏదో ఒక పని చేసే వాడే ఉత్తముడు.
ఏకాగ్రతతో చేసే ఏ పని అయినా తపస్సే. ముందో వెనకో దానికి ఫలితం తప్పదు.
నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి.
నాలో ఏ లోపమూ లేదు అనుకోవడాన్ని మించిన లోపం మరొకటిలేదు.
విద్య, వివేకం బావిలోని నీళ్ళవంటివి. వాడిన కొద్దీ ఊరుతూ ఉంటాయి.
అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా, దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి.
ఆదియందు అక్షరమున్నది. అక్షరము దైవమై ఉన్నది. నట్టనడుమనూ అక్షరమున్నది. ఆ అక్షరము మనిషియై ఉన్నది. అంతము నందూ అక్షరమే ఉంటుంది. అక్షరం మనిషిలోని దైవమై ఉంటుంది.
'సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు.దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి.
ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం పొందబోతున్నావన్న మాటే. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది.
అందమైనది మంచిగా ఉంటుందనుకోలేం. కానీ మంచిగా ఉన్న ప్రతి విషయం అందమైనదే.
ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు. ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. 
అవివేకమంటే- ఈసారి ఫలితం మరోలా ఉంటుందనే ఆశతో, చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుండడం.
మనలోని గొప్పతనం మనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది. 
మానవులకు 'విద్యయే' సౌందర్యము 
సూర్యుని ఉపాసించుట వలన 'ఆరోగ్యము' బాగుంటుంది 
'జ్ఞానము' పెన్నిధి వంటిది 
'సత్యము' పలుకుటయే కంఠానికి ఆభరణము 
సాధుపురుషుల 'ప్రవర్తనే' ఆచారమునకు ముఖ్యము 
శరీరమే ధర్మసాధనములలో ప్రధానమైనది 
సత్యము - తపస్సు - ఇంద్రియనిగ్రహము - భూతదయలు అంతఃశౌచములు 
సత్పురుషులకు 'ఆచారమే' లక్షణము 
విద్య వలన 'సంస్కారము' కలుగవలెను 
విద్య వలన 'వినయము' కలుగవలెను
విద్యను కోరువాడు 'సుఖము'ను త్యజించవలెను 
'ధర్మము' వలన 'ఆయుష్షు' వృద్ధి చెందుతుంది
ఆచారము నుండి  'ధర్మము' పుట్టినది
శాస్త్రములన్నింటి కంటే 'ఆచారము' శ్రేష్టమైనది
విద్య'కల్పవృక్షం' వంటిది 
ఆచారమే 'ధర్మము' నకు లక్షణము 
దైవం ప్రతి మనిషిలో అమర్చే గొప్ప సంకేత దీపం అంతఃకరణ.
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే, ఆ పశ్చాత్తాపానికి విలువేముంది!
భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసే పని సత్ఫలితాన్నిస్తుంది. 
బలమైన గాటకు బరువుగా కట్టేస్తే ఎన్ని తుపానులు వచ్చినా - పడవ తీరంలో భద్రంగానే ఉంటుంది. కానీ, దాన్ని నిర్మించింది తీరంలో కట్టి పెట్టడానికి కాదన్న విషయాన్ని గ్రహించాలి. అదే - జ్ఞానం. 
మంచి అలవాట్లు మానడం చాలా సులువు చెడు అలవాట్లు మానడమే మహాకష్టం. 
ప్రయత్నం చేసి ఓడిపో .... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. 
బ్బు కాదు.... డబ్బు మీద ప్రేమ, మోహం,దురాశ అనర్థాలకు హేతువులు. 
సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం, సర్వేంద్రియాణాం 
నయనం ప్రధానం! 
షణ్ణం రసానాం లవణం ప్రధానం, 
భావవే నదీనాముదకం ప్రధానం 
ఈ శ్లోకంలో "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అనేది జాతీయంగా ప్రాచుర్యంలో ఉంది. దీని భావమేమంటే దేహానికి శిరస్సు ప్రధానం. అవయవాలన్నింటిలోనూ కళ్లు ప్రధానమైనవి. ఆరు రుచుల్లోనూ ఉప్పు ప్రధానమైనది. అలాగే నదులన్నింటికీ నీరు ప్రధానం. 
స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వగ్రామే పూజ్యతే ప్రభుః !
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే!
మూర్ఖుడికి తన ఇంట్లో మాత్రమే గౌరవం ఉంటుంది. గ్రామాధికారికి తన గ్రామంలో మాత్రమే గౌరవం దక్కుతుంది. రాజుకు తన స్వదేశంలో మాత్రమే  గౌరవం ఉంటుంది. విద్వాంసుడికి మాత్రం తన ప్రాంతంలోనే కాకుండా, ఎక్కడకు వెళ్లినా గౌరవం దక్కుతుంది. 
భుజకీర్తులూ, చంద్రహారాలూ, స్నానమూ, పైపూతలూ, పూలూ అందంగా అలంకరించుకున్న శిరోజాలు - ఇలాంటివి వేవీ మానవుడికి శోభ కలిగించవు. శాస్త్ర సంస్కారం కల 'వాక్కు' ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది. పైన చెప్పిన సువర్ణాభరణాదులు అన్నీ నశించిపోయేవే. వాక్కు అనే భూషణ మొక్కటే శాశ్వతంగా నిలిచే భూషణం. 
గడిచిపోయిన దాన్ని గురించి ఊరికే ఆలోచించకూడదు. జరగబోవుదాన్ని గురించి ఆశాసౌధములు కడుతూ కూర్చోకూడదు. విచక్షణ జ్ఞానం గలవారు వర్తమానంలో నివసిస్తూ అప్పుడు చేయవలసిన పనులనే ఆచరిస్తారు. 
పదలయందు ధైర్యం, సంపదలున్నప్పుడు ఓర్పు, సభలలో వాక్చాతుర్యం, యుద్ధంలో పరాక్రమం, కీర్తి సంపాదించుటలో ఆసక్తి, విద్యలయందు ఆసక్తి - ఈ గుణాలు మహాత్ములకు ప్రకృతి సహజములు 
అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం - ఈ ఐదూ అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. 
కార్లో కూర్చున్నంత మాత్రాన గొప్పవారు కాలేరెవరూ. కారు మీద కాకి కూడా కూర్చోవచ్చు. 
కోపం యమధర్మరాజు లాంటిది. తృష్ణ వైతరణి లాంటిది. విద్య కామధేనువు లాంటిది. ఇక, సంతృప్తి దేవరాజైన ఇంద్రుడు నందనవనం లాంటిది. 
అంతులేని బంధనాల్లో మనిషిని ఇరికించి వేసి, ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టే ఆశల పాశాలని తునాతునకలు చేయగలిగేది వైరాగ్యం అనే పదునైన కత్తి ఒక్కటే. 
మన పూర్వీకులు ఎంతో మంది అనుసరించి, పునీతం చేసిన బాట పైన మనం కూడా ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఆ మంచిబాటపై పయనించిన వారికెన్నడూ చలనం ఉండదు. 
మనసు నిండా నిజాయితీ ఉండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. 
మనిషికి మంచి మనసుండాలే గాని, నానా విధాల సంపదలూ వాటంతట అవే కురుస్తుంటాయి. 
ప్రేమగుణం బాగా పెరిగితే, లభించే సంపద - పవిత్రత. 
వివేకానికి మారుపేరుగా నిలిచిపోయే హంసపక్షి స్మశానంలో ఉండదు. అలాగే, మంచివారు చెడ్డవారితో కలసి మెలసి ఉండలేరు. 
హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులని విమర్శించే అధికారం ఉంటుంది. 
బంగారంలోని ప్రతి అణువు ఎంతో విలువైనది. గడిచే కాలంలోని ఒక్కొక్క ఘడియ సైతం అంతే!
మన వాకిట నిలిచిన మంచి వారినీ, మహా పురుషులనీ దర్శించుకుంటే చాలు, పుణ్యక్షేత్రాల్లో చేసిన కోట్లాది తీర్థస్నానాలకి మించిన ఫలం లభిస్తుంది. 
భగవంతుడి చల్లని చూపు లభించకపోతే, మంచి వారితో మైత్రిబంధం అసలే దొరకదు. 
సత్యమార్గం ఎంతో సులభం ...... సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం. 
న్నీ తెలిసి ఏదీ చెయ్యలేనివాడు ఏదీ తెలియనివాడితోనే సమానం. 
అపకీర్తి కలిగితే ........ ఇంక మరణ మెందుకు?
మంచి చదువుంటే ........ ధనమెందుకు?
తనలో గొప్పతనముంటే ........ మళ్ళీ అలంకారాలెందుకు?
మంచితనముంటే ........ వేరే పరివారమెందుకు?
నిర్మలమైన మనస్సుంటే ........ తీర్థసేవ లెందుకు?
సత్యముంటే ........ తపస్సు చేయవలసిన అవసరం  లేదు 
చాడీకోరతనం ఉంటే ........  వేరే పాపాలతో పని లేదు 
పిసినారితన ముంటే ........ మరొక దుర్గుణం అక్కరలేదు 
మౌనాన్ని సాధన చేస్తూ, ఇతరుల మాటల్ని వినే గుణాన్ని పెంపొందించుకోవాలి
కాలానికి అతీతమైనది అమృతత్త్వం 
మనస్సుని అభ్యాసంతో వశపరచుకోవచ్చు 
మనస్సు నిరంతరం అతి చంచలస్వభావం గలది 
'క్షమాగుణం' ధీరుల లక్షణం 
లభించిన దానితో సంతృప్తి పడాలి 
చేసే పనిమీద ప్రేమ ఉంటే అంతా అందంగా ఉంటుంది 
ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తారో అతడే నిజమైన యోగి 
జ్ఞానతృష్ణ వైపు మనసుని మరల్చాలి 
నీతిగలవారికి భయం ఉండదు 
మనం 'మాయ' ఆధీనంలో ఉంటే, మాయ 'భగవంతుని' ఆధీనంలో ఉంటుంది 
తపస్సు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది 
దైవాంశలమే అయినా మనం 'మాయ' ఆధీనంలో ఉన్నాము 
మానవులందరిలోనూ 'యోగబలం' ఉంటుంది
బంధవిముక్తి మార్గం - మమకారాలు లేని కర్మల్ని ఆచరించటమే!
కర్మవల్ల బంధం కల్గుతుంది 
తపస్సంటే - మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రపరచి, వశంలో ఉంచడమే!
నిష్కామకర్మ - ధ్యానం ల కలయికే ఆధ్యాత్మికత 
మానవ శరీరం సుఖసౌఖ్యాలనుభావించడానికి ఉద్దేశింపబడలేదు 
ఆధ్యాత్మికోన్నతికి, సౌశీల్యబలము అత్యంతావశ్యకము 
విశాల హృదయం, దృఢవిశ్వాసం ఉన్నప్పుడే ఉన్నతమైన వ్యక్తిత్వం సాధ్యపడుతుంది 
బలహీనతలు బలం వల్లే సమసిపోతాయి 
ఎదుటివారిని ఒక చిన్న అభినందన ఉత్తేజితుల్ని చేస్తుంది 
సమస్యల నుంచి పారిపోవడం వాటికి పరిష్కారం కాదు 
మానవునికి సౌశీల్యమే బలం 
బలహీనత, సౌశీల్యం కలసి మెలసి ఉండవు 
మనిషి మనస్సును స్వాధీనపరచుకుంటే ఆనందాన్ని అనుభవించగలడు 
'ఆనందం' మనసుకు సంబంధించినది 
బాహ్యోపకరణాలు మనిషికి ఆనందాన్ని ఇవ్వలేవు 
మానవుడు స్వతహాగా దివ్యస్వరూపుడు 
మనిషికి నిరంతరం అపనమ్మక ధోరణి మంచిది కాదు 
మానవునిలో 'ఆధ్యాత్మిక' స్పృహ ఉండాలి
'జ్ఞానం - తపస్సు' సమాంతరంగా సాగిపోవాలి. 
జ్ఞానాన్ని సంపాదించాలంటే 'తపస్సు' చేయాలి. 
మానవుడే 'జ్ఞానార్జన' కు అర్హుడు. 
నీచులు విఘ్నాలు వస్తాయన్న భయంతో పనికి పూనుకోరు. మధ్యములు పని ప్రారంభించి ....... విఘ్నాలు ఎదురైతే వదిలేస్తారు. ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా ......... పూనుకొన్నపని నెరవేరేవరకూ వదలనే వదలరు. 
నీచులు కలహం కోరుకుంటారు. సజ్జనులు సంధిని కోరుకుంటారు. 
ఉత్సాహం కంటే గొప్పబలం లేదు 
తాను చేసిన పుణ్యాన్ని బట్టి మానవునికి కీర్తి లభిస్తుంది 
పుణ్యవంతుడైన పురుషునకు ఎక్కడా అసౌకర్యం ఉండదు 
ఇతరులను బెదిరించి సంపాదించిన సంపద త్వరలో నశిస్తుంది 
సరియైన మార్గంలో ప్రారంభించిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి 
జ్ఞానం కన్నా సుఖాన్ని కలిగించేది వేరేది లేదు 
నోరు ఉన్నది కదా అని వృథాగా మాట్లాడకూడదు 
కష్టపడటం వల్ల వచ్చిన సుఖమే ఆనందాన్ని కలిగిస్తుంది 
ఎవరికీ ఏ పనిలో నేర్పు ఉంటుందో వారిని  ఆ పనిలో నియమించాలి 
గుణాలతో వైభవాన్ని పొందవచ్చు కాని వైభవంతో గుణాలను పొందలేము. 
బుద్ధిమంతులు కాలాన్ని బట్టి వ్యవహరిస్తారు 
శీలంతో సమానమైన ఆభరణం లేదు 
బుద్ధిమంతునికి అహంకారం ఉండదు 
శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే స్మరించాలి 
మంచిపనులు చేసేవాడు కష్టాల్లో ఎప్పుడూ ఇరుక్కోడు 
ఎవడైతే ధర్మాన్ని కోరుతాడో అతడే ఆరోగ్యవంతుడు 
ఓర్పువల్ల సిద్ధించని కార్యమంటూ ఉండదు
క్షణక్షణానికి ఆలోచనలు మారిపోయేవాడు ఏమీ సాధించలేడు 
పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు అధికంగా గౌరవార్హుడు. 
జ్ఞానం అనేది పెన్నిధి వంటిది 
విద్య నేర్చినకొద్దీ వృద్ధి పొందుతుంది
సంపదలన్నిటిలోను విద్యాసంపద గొప్పది 
ఇంటికి అతిథిగా వచ్చినచో శత్రువుకైననూ ఆతిథ్యమివ్వాలి 
తప్పులు జరగవచ్చుననే భయంతో ఏపని అసలే ఆరంభించకుండ ఉండడం కాపురుష లక్షణం. 
ధర్మార్గంలోనే ధనం సంపాదించాలి. 
ఉత్తమోత్తములకు అడుగడుగున మిత్రులు ఏర్పడుతూనే ఉంటారు. 
నేర్పుతో పనిచేయువాడు ఏదీ దాచుకొననివాడు 
తెలివిగా కార్యారంభం చేసేవానికి సాధించరాని పనులేవి ఉండవు. 
జ్ఞానియే మనలో శ్రేష్ఠుడు 
సర్వమూ అస్థిరమైన ఈ లోకమునందు ధర్మమొక్కటే స్థిరమైంది. 
అధర్మమం వంశనాశనానికి, ధర్మం వంశవృద్ధికి కారణం అవుతుంది. 
ఆశకు దాసులైనవారు లోకానికంతకు దాసులే. 
తల్లి, తండ్రి, మిత్రుడు - వీరే సహజముగా ప్రతి ఒక్కరికి హితులైనవారు. 
మానవుడు తన నడవడిని యత్నంతో చక్కబరచుకోవాలి. 
స్వార్జిత ధనంతో జీవనయాత్ర గడుపుట ఉత్తమం. 
స్త్రీలు పూజింపబడుచున్న చోట్లనే దేవతలు సంచరిస్తారు. 
ఎవడూ ఎవనికి స్వతహాగా మిత్రుడూ కాడు, శత్రువూ గాడు. 
సత్పురుషులెన్నడు ఆపత్సమయాలలో అధైర్యం చెందరు. 
శత్రువు ఎంత అల్పుడైనప్పటికీ ఎంతో బాధాకరుడుగా పరిణమిస్తాడు. 
ధన సంపాదన చాలా కష్టం - సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టం. 
'నేను ఈ పని చేయగలను ' అనుకుంటే - మీరు సగం విజయం సాధించినట్లే
సౌందర్యమే సత్యం............ సత్యమే సౌందర్యం. 
మనిషికి తన జీవితంలో సత్యం పలకాలి........... ప్రియమైన మాటలు పలకాలి. అయితే ప్రియం కానప్పుడు, అ సత్యాన్ని పలకకుండా ఉండడమే శ్రేయస్కరం. 
అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది
సరస హృదయం ఉన్నవారు సాధారణముగా మృదువైన స్వభావము కలిగి ఉంటారు 
మనం మంచివారితో సాంగత్యం చేస్తూ జీవనం సాగిస్తుంటే, చెడు గుణాలు సైతం మంచి గుణాలుగా పరిగణింపబడుతుంటాయి. 
ఆలోచనల యుద్దంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు 
వైరం అంతమయ్యేది మృత్యువుతోనే 
మంచి మనషుల మనసులు వెన్నలా ఉంటాయి 
ప్రపంచంలో ఎన్నో రకాల యుద్దాలు ఉంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాసంగ్రామం లాంటిది.
విద్యావంతులమైతే మన దగ్గర అక్షయ పాత్ర ఉన్నట్టే
బలం ఉండటం గొప్పకాదు, దాన్ని సరిగా ఉపయోగించుకోవటమే గొప్పతనం. 
అపారంగా ఇవ్వడం కాదు, అవసరం బట్టి ఇవ్వడమే నిజమైన ఔదార్యం అనిపించుకుంటుంది. 
ఎవరూ తప్పులెన్నలేని విధముగా చేసి చూపాలనుకునేవారు ఎప్పటికీ ఏ పనీ చేయలేరు. 
దేహం స్నానంతో శుభ్రమవుతుంది, మనసు జ్ఞానంతో శుభ్రమవుతుంది. 
డబ్బు, అధికారం కోసం సాగే పరుగు పందెంలో ముందుగా ఓడేవి ధైర్యం, నిజాయితీ
స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది, సంతోషాన్ని హెచ్చిస్తుంది. 
జీవితంలో తప్పులు అందరు చేస్తారు. వాటిని సరిదిద్దుకొనే వారే విజేతలుగా నిలుస్తారు. 
క్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా, కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తిని ఇస్తుంది.  
న మనస్సు నిర్మలంగా ఉంటే ప్రపంచం మొత్తం స్వర్గంగానే కనిపిస్తుంది
ముందూ వెనకా ఆలోచించకుండా వాగ్దానాలు ఇచ్చేవారు వాటిని నెరవేర్చలేరు
మంచి అలవాట్లు రావాలంటే మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి
భాగ్య రోగులకు సేవ చేయడం కన్నా మించిన పుణ్యకార్యం మరేదీ లేదు
కోపం మనశ్శాంతిని దూరం చేస్తుంది.
న వ్యక్తిత్వం మనం చేసే పనుల్లో కనిపిస్తుంది.
క్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా, కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తినిస్తుంది
నుషుల్లో వైరానికి అయిదు కారణాలుంటాయి - స్త్రీలు, ఆస్తిపాస్తులు, వాక్కులు,కులమత ద్వేషాలు, ఎప్పుడో 
    తెలిసో తెలియకో చేసిన అపరాధాలు 
సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూ ఉండవు 
ల్లితండ్రులు తమ సంతానానికి అందించినవాటికి ప్రతిఫలం యీ సృష్టి లోనే లేదు 
విజ్ఞానం లేని జీవితం , నూనే లేని దివ్వెలాంటిది 
 స్వేదాన్ని శక్తిగా మార్చి బిడ్డలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేది అమ్మ ఒక్కటే 
త్మ విమర్శ చేసుకొనేవాళ్లే వికాస మార్గంలో నడుస్తారు. 
నసు  ప్రశాంతముగా ఉంటే, ప్రపంచం మొత్తం ప్రశాంతముగా ఉన్నట్లు కనిపిస్తుంది. 
నం ఒక్క నిముషం కోపంగా ఉన్నామంటే, ఒక్క నిముషం సంతోషానికి దూరమైనట్టే. 
వ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో పెత్తనం కాదు .
దుటి వారిపై అసూయ పడుతున్నామంటే అది మన ఆరోగ్యానికే చేటని గ్రహించాలి. 
కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే !
మంచి ఆలోచనలు ఆరోగ్యాన్నియిస్తాయి.చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చి పెడతాయి. 
రొకరిని హింసించి ఆనందించడం పాశవికమైన చర్య.
ద్ధకం మనిషి బద్ధ శత్రువు లాంటిది.
కంచు మ్రోగునట్లు కనకం మ్రోగునా.
నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు.
సత్యమాడుట పిరికి పందల గుణం.
నిజాన్ని నిర్భయముగా చెప్పవలెను.
హంకారం మనషుల మధ్య దూరాలను పెంచుతుంది.
నం సరిఅయిన జ్ఞానం సంపాదించిననాడు ఇతర మతాలతో సంఘర్షణకు దిగకుండా ఉంటాం.
ఠినమైన విద్య అంటూ ఏది లేదు, అయితే దాన్ని ఇష్టపడి చదవకపోతే అది కష్టంగా అనిపిస్తుంది.
డ్డున నిలిపిన నావకు ఏ ప్రమాదం జరుగదు.కానీ దాన్ని తయారుచేసింది సముద్రం లోనికి పంపడానికే కదా!
జీ వితంలో భయం లేకుండా, ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాదించగలరు.
ధైర్య సాహసాలు. ప్రతిభ ప్రతీ మనిషి విజయానికి సోపానాలు.
ప్రశంస పన్నీరు వంటిది, దాన్ని వాసన చూసి వదిలేయాలే తప్ప తాగుతూ కూర్చోకూడదు.
రులను నిందించటం కాదు, ఎప్పటికప్పుడు నీ తప్ప్పులు తెలుసుకొని సరిదిద్దుకో.అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు.

1 comment:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు