Pages

ఉడుత - బాలల గేయం 3

ఉడతా! ఉడతా! ఓ ఉడతా!
దిగి వస్తావా? మిఠాయి పెడతా!

చెట్టు ఎక్కడం ఎట్లాగో
గుట్టు విప్పి మరి చెబుతావా!
కొమ్మలు తిరగడమెట్లాగో
నెమ్మదిగా వివరిస్తావా?

చిటారు కొమ్మన ఉంటావు
హఠాత్తుగా దిగి వస్తావు
చప్పుడు కొంచెం వినపడితే
చప్పున తప్పుకుంటావు!

చిట్కాలేవో చెబుతావా?
చిటారు కొమ్మకు చేరెదను!
మెళుకువలన్ని చెబుతావా?
హుటాహుటిన దిగివచ్చెదను!

వారధి కట్టే సమయాన
సాయపడితివట రామునికి
ఉడతాభక్తికి నీపేరే
తలచుకొందురు ఎప్పటికీ!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు