వేమన పద్యాలు - ప్రియములేని విందు
ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: ప్రేమలేని అన్నసంతర్పణము నందు పిండివంటకము వ్యర్థము. బంగారము అపాత్రత గల దానిచ్చి సొమ్ములు చేయమంటే బంగారము వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై నమ్మకం లేని పూజ పత్రి పరమ వ్యర్థమని భావము.
No comments:
Post a Comment