Pages

Bhaskara Shataka Padyalu - ఏగతి బాటుపడ్డ గలదే భువి నల్పునకున్ సమగ్రతా

భాస్కర శతక పద్యాలు - ఏగతి  బాటుపడ్డ  గలదే  భువి  నల్పునకున్  సమగ్రతా 
ఏగతి బాటుపడ్డ గలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము భాగ్యరేఖ గలపుణ్యునకుంబలె భూరిసత్త్వసం
యోగమదేబకుంభయుగళోత్థితమాంసము నక్కకూన కే
లాగుఘటించు సింహముదలంచిన జేకుఱు గాని భాస్కరా!

తాత్పర్యము : నీచుడెంత శ్రమపడినను, భాగ్యలక్షణములు గల పుణ్యాత్మునకువలె భోగమబ్బదు. మదపుటేనుఁగు గున్న తలయందలి మాంసము సింహమునకు సాధ్యమగును గాని నక్కకు జిక్కునా? చిక్కదు.  

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు